వన్ ప్లస్ 5... అమ్ముడు..లెట్స్ డు కుమ్ముడు - MicTv.in - Telugu News
mictv telugu

వన్ ప్లస్ 5… అమ్ముడు..లెట్స్ డు కుమ్ముడు

July 1, 2017

వన్ ప్లస్ 5 మొబైల్ భారత మార్కెట్ లో దుమ్మురేపుతోంది. విడుదలైన వారంలోనే రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయి. కొంటే వన్ ప్లస్ ఫైవ్ ఫోన్ నే కొనాలనే రేంజ్ లో అమ్మకాలు సాగుతున్నాయి. ఇంతకీ వన్ ప్లస్ 5 లో ఏం ఫీచర్లు ఉన్నాయి.?కస్టమర్లను ఇంతలా ఎందుకు ఆకట్టుకుంటుదంటే..

చైనా మొబైల్స్ కంపెనీ వన్ ప్లస్ నూతన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ 5ను గత నెల 22న భారత్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్ అమెజాన్ సైట్‌లో యూజర్లకు అందుబాటులో ఉంది. ఆ సైట్‌లో విడుదలైన వారంలోనే ఎక్కువగా అమ్ముడైన ఫోన్‌గా వన్‌ప్లస్ 5 రికార్డు సృష్టించింది. ఇది 6జీబీ ర్యామ్/64జీబీ మెమరీ ,8జీబీ ర్యామ్/128జీబీ మెమరీ వేరయంట్లో దొరుకుతుంది.

వన్ ప్లస్ 5 ఫీచర్స్

5.5 ఇంచెస్ డీస్ ప్లే, పుల్ హెచ్ డీ స్క్రీన్

ఆక్టాకోర్ క్వాట్ కామ్,స్నాప్ డ్రాగర్ 835

16 ఎంపి ప్లస్ 20ఎంపి రియర్ డ్యూయల్ కెమెరా

16ఎంపి ప్రంట్ కెమెరా

3,300ఎంపి హెచ్ బ్యాటరీ

ఫింగర్ ప్రింట్ స్కానర్