Home > Featured > వన్ ప్లస్ కొత్త ఫోన్ రాబోతున్నది!

వన్ ప్లస్ కొత్త ఫోన్ రాబోతున్నది!

One plus new smart phone nord 3 phone specifications

వన్ ప్లస్ ఫోన్ అంటేనే అదో వైబ్రేషన్ స్మార్ట్ ప్రేమికులకు. ఎప్పుడెప్పుడు కొత్త ఫీచర్లతో ఫోన్లను లాంచ్ చేస్తారా అని ఎదురుచూస్తుంటారు చాలామంది. త్వరలో నార్డ్ 3 రాబోతుందని ఊహగానాలు మొదలయ్యాయి. వాటి ఫీచర్స్ గురించే ఈ కథనం.. వన్ ప్లస్ ఫోన్లు కొత్త ఫీచర్లతో ఇప్పటివరకు ఎన్నో వచ్చాయి. త్వరలో మరో ఫోన్ రాబోతుందని టెక్ ప్రేమికులకు లీకులు అందుతున్నాయి. 27, 999 రూపాయల్లో ఈ ఫోన్ ఉండబోతుందట. ఇక ఈ వన్ప్ల స్ నార్డ్ 3 12‌‌‌‌0హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్‌తో, 6.7 అంగుళాల హెచ్డీ, ఎల్సీడీ పూర్తి డిస్ప్లేతో రాబోతున్నది. ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ పని చేస్తుంది. నార్డ్ 2 సీఈ 5జీకి ఇది అప్డేట్ వెర్షన్.

108 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో పనిచేస్తుందీ ఫోన్. అంతేకాదు.. 2 మెగా పిక్సెల్ సెన్సార్లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కూడా నార్డ్ కలిగి ఉంది. ఈ వన్ ప్లస్ నార్డ్ సీఈ 3 5జీ స్మార్ట్ ఫోన్ 67 వాల్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ పని చేస్తుంది. ఈ ఫోన్ 6/8 జీబీ రామ్, 128 జీబీ అంతర్గత నిల్వతో మెడిటెక్ డెన్సిటీని కలిగి ఉంటుంది. ఇది రెండేండ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్లను పొందుతుంది. అలాగే ఆండ్రాయిడ్ 13 ఓఎస్కి అప్గ్రేడ్ చేయబడుతుంది కూడా. డిస్ ప్లేకు ఎడమ వైపు పంచ్ హోల్ ఉంది. ఇన్డిస్ ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్ బ్లాక్, గోల్డ్ కలర్లలో డిసెంబర్ చివరి వారంలో లాంచ్ చేస్తారని అనుకుంటున్నారు. ఇంకో నెల రోజులు మనం ఎదురుచూస్తే ఈ ఫోన్ మన చేతుల్లో ఉండబోతుంది.

Updated : 14 Nov 2022 8:26 AM GMT
Tags:    
Next Story
Share it
Top