రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్..సీఎం కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

రూపాయికే ఇంటి రిజిస్ట్రేషన్..సీఎం కేసీఆర్

July 19, 2019

One rupee charge for house registration says telangana cm kcr........

 తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కొత్త మున్సిపల్ చట్టంపై చర్చ జరుగుతోంది. ఈ చట్టం ఆవశ్యకత, ముఖ్యాంశాలు, లక్ష్యాలు, ఆలోచనలను సీఎం కేసీఆర్‌ వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’అవినీతి రహిత పాలన కోసం కొత్త మున్సిపల్ చట్టం తెస్తున్నాం. పంచాయతీ అనేది ఒక విభాగం కాదు, ఓ ఉద్యమం. గ్రామ స్వరాజ్యం కోసం మహాత్మాగాంధీ కలలు కన్నారు. పంచవర్ష ప్రణాళికలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని గాంధీ చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ శిక్షణ ద్వారా పంచవర్ష ప్రణాళికలపై అవగాహన కల్పిస్తాం. భారత ప్రజాస్వామ్యం విస్త్రృతమైనది. మనది చాలా బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న దేశం’ అన్నారు. తెలంగాణ పురపాలక చట్టం-2019 ద్వారా పారదర్శకత వస్తుందన్నారు. ఈ చట్టాన్ని అనుసరించి 75 గజాలలోపు ఇంటి నిర్మాణానికి రిజిస్ట్రేషన్‌ ఫీజు కేవలం రూపాయి మాత్రమే ఉంటుందని, జీ ప్లస్‌ 1 వరకు రూపాయితో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు.