జగన్ పెట్రో బాదుడు.. ఎవరు ఓదార్చాలి! - MicTv.in - Telugu News
mictv telugu

జగన్ పెట్రో బాదుడు.. ఎవరు ఓదార్చాలి!

September 18, 2020

One rupee ses on petrol and diesel in andhra pradesh

కరోనా వైరస్ కారణంగా మెజారిటీ ప్రజలు ఉపాధి కోల్పోయారు. ప్రజల ఆదాయం గణనీయంగా తగ్గింది. నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి కూడా ప్రజల దగ్గర పైసలు ఉండడం లేదు. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నది. తాజాగా పెట్రోల్, డీజిల్ పై రూపాయి సెస్‌ విధించింది. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం రెండు నెలల్లో ఇది రెండోసారి. ఈ మేరకు ఈ నెల మూడవ తేదీనే మంత్రివర్గం‌ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ఇన్ని రోజులు గోప్యంగా ఉంచారని తెలుస్తోంది. 

ఈ పెంపుతో ఏటా రూ.600 కోట్లు రాబట్టాలని యోచిస్తోంది. సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం కోసం ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా వచ్చే అదనపు ఆదాయాన్ని రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతుంటే ఏపీలో మాత్రం పెరుగుతున్నాయి. గురువారం పెట్రోల్, డీజిల్ ధరలను 13-20 పైసలు తగ్గాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 81.55 నుండి రూ. 81.40 ఉంది. డీజిల్ లీటరుకు రూ. 72.56 నుండి రూ. 72.37కు తగ్గింది. హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.84.60, డీజిల్ ధర రూ. 78.88 ఉంది. అమరావతిలో పెట్రోల్ ధర రూ.86.18, డీజిల్ రూ. 80.07 ఉంది.