One Scratch on a Nonstick Pan Can Release 9,100 Plastic Particles, New Study Finds
mictv telugu

నాన్ స్టిక్ పాత్రల్లో వంట చేస్తున్నారా.. బీ కేర్ ఫుల్!

November 8, 2022

దోసెలు, ఆమ్లెట్లు పలుచగా రావాలనో, కూరలు, వేపుళ్లు మాడిపోకుండా ఉంటాయనే ఉద్ధేశంతో నాన్ స్టిక్ పాత్రలు వాడుతున్నారు చాలామంది మహిళలు. వంటింట్లో ఆందంగా కనిపించే ఈ పాత్రలు ఆరోగ్యానికి ఎంత హాని చేస్తాయో ఇటీవల చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. మామూలు పాత్రల మీద టెఫ్లాన్ అనే కెమికల్ కోటింగ్ వేయడం వల్ల అవి నాన్ స్టిక్ పాత్రలుగా మారతాయని, అయితే వాడుతూ వాడుతూ ఉండగా ఆ కోటింగ్ కూడా ఆహారంతోపాటు మన శరీరంలోకి చేరుతుందని వెల్లడైంది.

ఫ్లైండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూకాస్టిల్ కు చెందిన పరిశోధకులు నాన్ స్టిక్ పాత్రల వాడకంపై ఓ పరిశోధన నిర్వహించి ఈ నిజాలను చెప్పారు. ఇలా తొలగిపోయే టెఫ్లాన్(ఒక్క స్క్రాచ్ పడితే) కోటింగ్ రూపంలో 9,100 కెమికల్ పార్టికల్స్ మన ఆహారంలోకి చేరుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. మైక్రో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్ విడుదలను తెలుసుకునేందుకు పరిశోధకులు రామన్ ఇమేజింగ్ టెక్నిక్ ను పాటించారు. టెఫ్లాన్ కోటింగ్ తొలగిపోతున్న పాత్రల నుంచి 2.3 మిలియన్ మైక్రో ప్లాస్టిక్, నానో ప్లాస్టిక్ కణాలు విడుదల అవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఈ టెఫ్లాన్ మైక్రో ప్లాస్టిక్స్ ఆహారంలో కలుస్తుండడం ఆరోగ్యం విషయంలో ఆందోళన కలిగించే అంశంగా యూనివర్సిటీ ఆఫ్ న్యూకాస్టిల్ పరిశోధకుడు డాక్టర్ చెంగ్ ఫాంగ్ పేర్కొన్నారు. వీటి కారణంగా జరిగే నష్టంపై పరిశోధన అవసరం ఉందన్నారు. కనుక వంటలకు వినియోగించే పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని ఫ్లైండర్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టాంగ్ చెప్పారు.