One to spot 'Lingam' in Amarnath cave was a Muslim man: Farooq Abdullah
mictv telugu

అమర్‌నాథ్‌ శివలింగాన్ని కనిపెట్టింది ముస్లిమే.. ఫరూక్ అబ్ధుల్లా

July 5, 2022

జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అమర్‌నాథ్ యాత్రలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రతిరోజూ వేలాది మంది పవిత్ర గుహను సందర్శిస్తున్నారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో భక్తులు అమర్‌నాథ్ గుహను సందర్శించారు. అయితే ఈ గుహలో శివలింగం ఉన్న సంగతి మొదట గుర్తించిందే ముస్లిం అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. పహల్గామ్ కు చెందిన ముస్లిం వ్యక్తి అమర్ నాథ్ గుహలో శివలింగాన్ని చూసి, ఆ విషయాన్ని కశ్మీరీ పండిట్లకు చెప్పాడన్నారు.

ఏ ముస్లిం కూడా ఇంతవరకు మరే మతం పట్ల వేలెత్తి చూపలేదన్నారు ఫరూక్. కాకపోతే 1990ల్లోనే ఆ ధోరణి కనిపించినట్టు అంగీకరించారు. మరోవైపు వర్షాల కారణంగా ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితులను సమీక్షించిన అధికార యంత్రాంగం అమర్ నాథ్ యాత్రను మంగళవారం నుంచి నిలిపి వేస్తున్నట్టు ప్రకటించింది. పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి యాత్రకు భక్తులను అనుమతించడం లేదని తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,000కు పైగా భక్తులు అమర్ నాథ్ ను దర్శించుకున్నారు.