జల్లికట్టులో విషాదం..ఒకరి మృతి - MicTv.in - Telugu News
mictv telugu

జల్లికట్టులో విషాదం..ఒకరి మృతి

January 16, 2020

fhn

తమిళనాడులోని తిరుచ్చి సురయార్‌‌లోనిర్వహించిన జల్లికట్టులో అపశృతి చోటు చేసుకుంది. ఎద్దులు జనాలపైకి దూసుకురవడంతో మహాలక్ష్మీ అనే మహిళ మృతి చెందింది. ఆ మహిళ జల్లికట్టు పోటీలను చుడడానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. 

సంక్రాంతి పండుగలో భాగంగా మూడో రోజు కనుమ సందర్భంగా…జల్లికట్టు వేడుకలు నిర్వహిస్తుంటారు. మధురై జిల్లా అవనియాపురం, అలంగానల్లూరు, పాలమేడులో ఈ పోటీలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ పోటీలను చూడడానికి భారీగా ప్రజలు వస్తుంటారు. ఎద్దులను అదుపు చేయడానికి యువకులు పోటీ పడుతున్నారు. ఉన్నతాధికరుల పర్యవేక్షణలో ఈ పోటీలు జరుగుతాయి. రాష్ట్ర ప్రజలంతా వేడుకలను చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గాయపడిన వారికి వైద్య చికిత్స అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కానీ ఈ ఏడాది జల్లికట్టులో మహిళ మరణించడం విషాదం నింపింది.