పుల్వామా దాడికి ఏడాది..అమర జవాన్లకు నివాళి - MicTv.in - Telugu News
mictv telugu

పుల్వామా దాడికి ఏడాది..అమర జవాన్లకు నివాళి

February 14, 2020

xcfbcvfb

సరిగ్గా 2019 ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్‌ పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఆత్మాహుతిదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై శ్రీనగర్ వైపు జవాన్ల కాన్వాయ్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ శ్రీనగర్ హైవే పక్కనే ఉండే కల్వర్టు పక్క నుంచీ తన వాహనాన్ని నడిపాడు. 

ఆ వాహనంలో భారీగా పేలుడు పదార్థాల్ని ఉంచాడు. తన శరీరానికి చుట్టూ పేలుడు పదార్థాల్ని తగిలించుకున్నాడు. అవంతీపుర దగ్గరలో తన వాహనంతో సైనికుల కాన్వాయ్‌కి ఎదురుగా వెళ్లి 78 వాహనాలున్న కాన్వాయ్‌లోని ఐదో వాహనాన్ని ఢీ కొట్టాడు. దాంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. కాన్వాయ్‌లోని ఐదవ వాహనం బాంబు దాడికి ముక్కలైంది. అందులోని సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై సర్జికల్ స్ట్రైక్ చేసింది. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడులుచేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. దాంతో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వీర జవాన్లకు యావత్ భారత్ నివాళులు అర్పిస్తోంది. సోషల్ మీడియాలో ప్రజలు తమ నివాళులు అర్పిస్తున్నారు.