ఒక్కరోజులో 3లక్షల వ్యూస్..! - Telugu News - Mic tv
mictv telugu

ఒక్కరోజులో 3లక్షల వ్యూస్..!

June 2, 2017

మైక్ టీవీ తొలి పాట ప్రభంజనం సృష్టిస్తోంది. 24 గంటల్లో మూడు లక్షల మంది చూశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 కోసం రూపొందించిన ప్రత్యేకపాట జన హృదయాల్ని ఆకట్టుకుంటోంది.
రేలారే రేలారే..
నీళ్లల్లో నిప్పల్లే.
పుట్టింది నిజమల్లే…
సింగిడి రంగుల పూల
ఇది జాన పదల మాల… అంటూ
తెలంగాణ గొప్పతనాన్ని అచ్చమైన యాసలో చాటిన పాట వీక్షకుల మనస్సు దోచేస్తోంది.
ప‌ల్లె మ‌ట్టి వాస‌న‌లే..
స్వ‌చ్ఛ‌మైన మనుషులే..
అంద‌మైన భూమి జ‌గ‌ములో
నాతెలంగాణా.. బంగారు భూమి జ‌గ‌ములో….అంటూ తెలంగాణ కీర్తి చాటుతోంది.
కొట్లాట నేర్పిన నేల తెలంగాణ
సిరులు పండే మాగాణి
చెరువుల మిల‌మిల మెరుపు
ప‌క్షుల కిల‌కిల అరుపు
అంటూ తెలంగాణ ఖ్యాతిని శిఖరానికి చేర్చింది.
మైక్ టీవీ తొలిపాటను చూసి ఆదరిస్తోన్న అందరికి ధన్యవాదాలు తెలుపుతుంది మీ మైక్ టీమ్.