OnePlus 10T could be the first OnePlus phone with 512GB storage model
mictv telugu

వన్‌ప్లస్ నుంచి తొలిసారి 512జీబీ ఫోన్… 5జీ, మరెన్నో..

July 12, 2022

OnePlus 10T could be the first OnePlus phone with 512GB storage model

ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ నుంచి సరికొత్త 5జీ ఫోన్ వస్తోంది. వన్‌ప్లస్ 10టీ ఇండియా లాంచ్ టైమ్‌లైన్ ఆన్‌లైన్‌లో లీక్ అయింది. వన్‌ప్లస్ నుంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ ఈ నెలాఖరులో లేదంటే ఆగష్టు మొదటి వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. దీనిపౌ వన్‌ప్లస్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. జులై 25 నుంచి ఆగ‌స్ట్ 1 మ‌ధ్య వ‌న్‌ప్లస్ 10టీ 5జీ లాంఛ్ కానుంద‌ని ఓ నివేదిక వెల్లడించింది. భార‌త్‌లో ఆగ‌స్ట్ తొలి వారంలో లేటెస్ట్ వ‌న్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ సేల్స్ షురూ అవుతాయ‌ని నివేదిక పేర్కొంది. వన్‌ప్లస్ నుంచి 512GB స్టోరేజీ మోడల్‌‌గా మొదటి స్మార్ట్‌ఫోన్ కావచ్చునని వెల్లడించింది. చైనీస్ టిప్‌స్టర్, డిజిటల్ చాట్ స్టేషన్, OnePlus 10T 16GB RAM + 512GB UFS 3.1 స్టోరేజ్ ఆప్షన్‌తో లాంచ్ కానుందని పేర్కొంది. అదే జరిగితే.. ఈ మోడల్ ధర చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది..

ఈ డివైజ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 50ఎంపీ మెయిన్ కెమెరా సెన్సార్‌, 8ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా, 2ఎంపీ మ్యాక్రో సెన్సార్‌ల‌తో ఆక‌ట్టుకోనుంది. ముందుభాగంలో ఫ్లాట్ స్క్రీన్‌, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ అమోల్డ్ డిస్‌ప్లే, 16ఎంపీ ఫ్రంట్ కెమ‌రా సెన్సార్ వంటి ఫీచ‌ర్లను క‌లిగి ఉంది. వ‌న్‌ప్లస్ 10టీ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగ‌న్ 8+ జెన్ 1 ఎస్ఓసీ చిప్‌సెట్‌, 150డ‌బ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 4800ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్ధ్యంతో రానుంది. OnePlus 10R స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుందని భావిస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్‌ అమెజాన్ ద్వారా అందుబాటులో ఉండవచ్చు.