వన్‌ప్లస్ ఫోన్లపై రూ. 10 వేల డిస్కౌంట్  - MicTv.in - Telugu News
mictv telugu

వన్‌ప్లస్ ఫోన్లపై రూ. 10 వేల డిస్కౌంట్ 

November 25, 2019

OnePlus 7T, 7 Pro Available With Special Offers on Amazon India

భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో అడుగుపెట్టి 5 వసంతాలు పూర్తి చేసుకున్నసందర్భంగా  చైనా మొబైల్‌ కంపెనీ వన్‌ప్లస్‌ భారీ ఆఫర్లను ప్రకటించింది. తన స్మార్ట్‌ఫోన్లు, టీవీలపై అమెజాన్ ఇండియాలో బంపర్ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లపై 10 వేల రూపాయల దాకా భారీ తగ్గింపు ఆఫర్‌ను వెల్లడించింది. వన్‌ప్లస్ 7 ప్రో 8 జీబీ ర్యామ్ ఆప్షన్‌ లాంఛ్ ధర  రూ.52,999 ఉండగా.. ఆఫర్ కింద ధర రూ .42,999లకే అందిస్తోంది.  అలగే వన్‌ప్లస్ 7 ప్రో 5,000 రూపాయల తగ్గింపుతో రూ .39,999  లభిస్తోంది. దీని అసలు ధర  వన్‌ప్లస్ 7 ప్రో 6జీబీ ర్యామ్ /128 జీబీ  స్టోరేజ్    వేరియంట్‌ ధర రూ .44,999 దిగి వచ్చింది. లాంచింగ్‌ ప్రైస్‌  రూ .48,999. వన్‌ప్లస్ 7టీ  ప్రారంభ ధర ధర  రూ. 37,000 ఉండగా ఆఫర్‌లో ఇప్పుడు రూ. 34000కే లభ్యం అవుతోంది. 

మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు వన్‌ప్లస్ 7 టి, వన్‌ప్లస్ 7 ప్రో కొనుగోలుపై వరుసగా రూ .1,500, రూ .2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఇఎంఐని కూడా అందిస్తోంది. దీంతోపాటు వన్‌ప్లస్ టీవీలపై కూడా డిస్కౌంట్లను ప్రకటించింది.  హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ / డెబిట్ కార్డు ఉపయోగించి వన్‌ప్లస్ క్యూ 1 టీవీ కొనుగోలుచేసిన  రూ .4 వేల తక్షణ తగ్గింపుతో రూ .69,899గా లభిస్తుంది. క్యూ 1 ప్రో టీవీ కొనుగోలుదారులకు తక్షణమే రూ .5 వేల తగ్గింపుతో ధర రూ .99,899గా లభిస్తుంది.