OnePlus Monitors Sale : OnePlus Monitor E 24, Monitor X 27 offer Sale In India
mictv telugu

ONE PLUS MONITOR’:మార్కెట్‌లోకి వన్‌ప్లస్ మానిటర్ E27, E24.. అదిరే ఆఫర్లు

February 17, 2023

చైనీస్ టెక్నాలజీ దిగ్గజం వన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌.. సెగ్మెంట్‌లోనే కాకుండా ఇతర విభాగాల్లోనే ఆకట్టుకుంటోంది. ఎక్కువగా ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్ కస్టమర్లపై దృష్టిసారిస్తూ హై-ఎండ్ రేంజ్‌లో ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తుంది. ఇటీవల రెండు కొత్త మానిటర్లను బడ్జెట్, మిండ్ రేంజ్‌లో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ మానిటర్ E24, మానిటర్ X27 పేరుతో వీటిని తీసుకొచ్చింది. భారత్‌లో వీటి అమ్మకాలు బుధవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఈ మానిటర్స్ ధరలు, స్పెసిఫికేషన్స్‌ ఓ సారి పరిశీలిస్తే..

అమెజాన్ (Amazon)లో ఈ రెండు కొత్త వన్‌ప్లస్ మానిటర్లకు సంబంధించి ఫస్ట్ సేల్ మొదలైంది. అందులో వన్‌ప్లస్ మానిటర్ E24 మోడల్ బడ్జెట్ రేంజ్‌లో అందిస్తోంది. ఈ డివైజ్ ధర రూ.11,999గా ఉంది. మిడ్ రేంజ్‌లో వచ్చిన వన్‌ప్లస్ మానిటర్ X27 ధర రూ.27,999గా ఉంది. ఈ రెండింటిపై ఈ-కామర్స్ సైట్లలో నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా అందిస్తోంది. ఈ మానిటర్స్ OnePlus.in, వన్‌ప్లస్ స్టోర్ యాప్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి.

వన్‌ప్లస్ మానిటర్ E24 స్టాండర్డ్ వేరియంట్ మోడల్ Full HD డిస్‌ప్లేతో వచ్చింది. 16.7 మిలియన్ లైఫ్- లైక్ కలర్స్, వైడ్ రేంజ్178-డిగ్రీ IPS ప్యానెల్‌ కలిగి ఉంది. రిఫ్రెష్ రేట్ 175Hz, డైనమిక్ ఫ్రేమ్ రేట్ మెనేజ్‌మెంట్, అడాప్టీవ్ సింక్ టెక్నాలజీ కలిగి ఉంది. డిజైన్ పరంగా చూస్తే.. మానిటర్ E24 ప్రీమియం స్లిమ్ 8mm డిజైన్, మెటల్ స్టాండ్, స్లీక్ బెజెల్స్ మూడు వైపులా ఉన్నాయి. ఈ మానిటర్ హైట్, యాంగిల్ అవసరానికి తగినట్టుగా అడ్జెస్ట్ చేసుకునే వీలుంది. లో బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ విజువల్స్ TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ ఫీచర్ ఉంటుంది. ఈ మానిటర్‌కు USB టైప్-సి కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. మల్టిపుల్ మోడ్‌లతో కస్టమైజ్డ్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్, సీమ్‌లెస్ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

మరోవైపు.. మానిటర్ X27 ప్రీమియం మోడల్ 68.5cms స్క్రీన్ సైజ్‌తో 165 రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. ఈ మానిటర్ గేమింగ్ ప్లేయర్లకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మానిటర్‌లో బిల్ట్- ఇన్ కేబుల్ మేనేజ్‌మెంట్ ఫీచర్‌ కూడా ఉంది. USB టైప్-C కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంది. మల్టిపుల్ మోడ్‌లతో కస్టమైజ్డ్ వ్యూవింగ్ ఎక్స్‌పీరియన్స్, సీమ్‌లెస్ మల్టీ టాస్కింగ్‌కు సపోర్ట్ అందిస్తుంది. స్మూత్ గేమింగ్ ఎక్స్‌పీరియన్స్,వేగంగా 1ms రెస్‌పాన్స్ అందిస్తుంది. AMD ఫ్రీసింక్ ప్రీమియంతో OnePlus Monitor X27 గేమ్‌కు తగినట్లుగా స్క్రీన్ అడ్జెస్ట్ చేస్తుంది. ఇష్టమైన గేమ్‌లను ఆడేందుకు కంటెంట్‌‌ను స్ట్రీమ్ చేసేందుకు షార్ప్ 2K QHD విజువల్ రిజల్యూషన్‌‌ను అందిస్తుంది