వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీ..తొలుత ఇండియాలోనే బోణి! - MicTv.in - Telugu News
mictv telugu

వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీ..తొలుత ఇండియాలోనే బోణి!

August 21, 2019

OnePlus TV launch.

చైనాకు చెందిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ త్వరలో స్మార్ట్‌టీవీల మార్కెట్‌లోకి అడుగుపెడుతుంది. ఈ అంశమై ఆ కంపెనీ సీఈవో పీటే లౌ మాట్లాడుతూ.. తొలి వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీని సెప్టెంబర్‌లో తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. పైగా మొదట ఇండియాలోనే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వన్‌ప్లస్‌ ఫోరంలో ఈ విషయాన్ని పోస్ట్‌ చేశారు. ఈ స్మార్ట్‌టీవీకి సంబంధించి ధర ఇతర వివరాలు వెల్లడించలేదు.

స్మార్ట్‌టీవీ తయారీపై గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు లౌ తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియాలో కంటెంట్‌ ప్రొవైడర్లతో సత్సంబంధాలు ఉన్నాయని, తమతో భాగస్వామ్యానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే యూరప్‌, ఉత్తర అమెరికా, చైనాలోనూ టీవీలను తీసుకురావడంలో భాగంగా అక్కడి స్థానిక కంటెంట్‌ ప్రొవైడర్లతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. స్మార్ట్‌టీవీ విభాగంలో అగ్రగామిగా నిలవాలన్నదే తమ లక్ష్యమని వివరించారు.