Home > Featured > నడి సముద్రంపై ONGC హెలికాప్టర్ ఎమర్జన్సీ ల్యాండింగ్.. కారణమేంటో!

నడి సముద్రంపై ONGC హెలికాప్టర్ ఎమర్జన్సీ ల్యాండింగ్.. కారణమేంటో!

ONGC helicopter makes emergency landing near rig in Arabian sea; all onboard rescued

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) కి చెందిన హెలికాప్టర్ ఒకటి మంగళవారంనాడు అరేబియా సముద్రంపై అత్యవసరంగా ల్యాండ్ అయింది. ముంబై హై‌లోని సాగర్ కిరణ్ వద్ద ఓఎన్‌జీసీ రిగ్‌పై ల్యాండ్ అయ్యే ప్రయత్నంలో అరేబియా సముంద్రంలో అది ల్యాండ్ అయింది. దీంతో రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి అందులోని 9 మందిని కాపాడింది.

ఓఎన్‌జీసీకి చెందిన ఆరుగురు సిబ్బంది, ఒక కాంట్రాక్టర్‌, ఇద్దరు పైలట్లతో వెళ్తోన్న హెలికాప్టర్‌ ఒకటి ఓఎన్‌జీసీ రిగ్‌కు సమీపంలో అరేబియా సముద్రంపై అత్యవసరంగా ల్యాండ్‌ అయినట్లు కంపెనీ ట్విటర్‌లో వెల్లడించింది. హెలికాప్టర్‌కు ఉన్న ఫ్లోటర్ల సాయంతో దిగినట్లు తెలిపింది. సమాచారం తెలియగానే, ఓఎన్‌జీసీ సహాయక చర్యలు చేపట్టింది. దీంతో వెంటనే రిగ్ నుంచి సహాయక బోట్లను పంపారు. భారత తీర దళం కూడా రెస్య్కూ ఆపరేషన్‌లో చేరింది. ఆఫ్‌షోర్ సప్లయ్ వెజల్ మాలవీయ-16 రంగంలోకి దిగి ఐదుగురుని కాపాడింది. ఎట్టకేలకు విజయవంతంగా హెలికాప్టర్‌లోని 9 మందిని రెస్క్యూ టీమ్‌ కాపాడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. హెలికాప్టర్ ఎందుకు అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చిందనేది మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అరేబియా సముద్రంలోని నిల్వల నుంచి చమురు, గ్యాస్ ఉత్పత్తి కోసం ఓఎన్‌జీసీ పలు రిగ్‌లు, ఇన్‌స్టలేషన్లను ఏర్పాటు చేసింది.

Updated : 28 Jun 2022 5:13 AM GMT
Tags:    
Next Story
Share it
Top