హనుమంతన్న సూపు సిరిసిల్ల పై పడింది..! - MicTv.in - Telugu News
mictv telugu

హనుమంతన్న సూపు సిరిసిల్ల పై పడింది..!

September 15, 2017

రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా.. దానిని ఇష్యూ చేసేందుకు  కాంగ్రెస్ నేత హనుమంత్ రావ్ అందరికంటే  ముందుంటారు. ‘అర్జున్ రెడ్డి’ ముద్దు పోస్టర్ అప్పుడు కూడా ఇటువంటి సిన్మలు మనకు అవుసరమారాబై అని బస్సుల మీదున్న పోస్టర్ను చింపి వార్తల్లో కెక్కిండు. అయితే తాజాగా ..నేరేళ్లలో దళితులపై, బడుగు బలహీన వర్గాలపై పోలీసులు చేసిన దాడులకు, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతూ.. కరీంనగర్ కలెక్టరేట్ దగ్గర ఈరోజు నుంచి జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో హనుమంత్ రావ్ పాల్గొన్నారు. ఇంతకు ముందు కూడా నిమ్స్ లోంచి నేరేళ్ల బాధితులకు ట్రీట్ మెంట్ చెయ్యకుండా బైటికి పంపిస్తే  హనుమంత్ రావ్ వెంటనే వెళ్లి  బాధితులను పరామర్శించి  ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.