మరీ ఇంత ఘోరమా..? పొలం నుంచి ఉల్లి పంట చోరీ..! - MicTv.in - Telugu News
mictv telugu

మరీ ఇంత ఘోరమా..? పొలం నుంచి ఉల్లి పంట చోరీ..!

December 4, 2019

Onion Crop01

ఉల్లి కొరత మనుషులను దొంగతనాలకు పాల్పడేలా చేస్తోంది. అక్కడా ఇక్కడా కాదు ఏకంగా పంట పొలాల్లోంచే దుండగులు ఉల్లి పంటను మాయం చేశారు. దర్జాగా పొలంలోకి చొరబడి పెద్ద ఎత్తున ఉల్లిని చోరీ చేశారు. మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తమ పంట చోరీకావడంతో రైతు లబోదిబోమంటూ కంటతడి పెట్టుకున్నాడు. ఈ ఘటనతో ఇక ఉల్లి పంటకు కూడా పోలీసులు రక్షణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

జితేంద్ర కుమార్ అనే రైతు ఉల్లి పొలంలో ఈ చోరీ జరిగింది. సుమారు రూ. 30 వేలకు పైగా ఖరీదు చేసే పంటను దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ  రైతు నారాయణగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా పూర్తిగా పంట చేతికి రాకముందే ఉల్లి ఎత్తుకెళ్లడం స్థానికంగా సంచలనం రేపింది. దొంగలను వెంటనే పట్టుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. కాగా ఉల్లి దొరకడమే బంగారం అన్నట్టుగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. దీంతో మార్కెట్లో ఉన్నవాటికే కాదు.. పంట చేలలో ఉన్న వాటిని కూడా వదలడం లేదు.