కొండెక్కిన ఉల్లి ధరలు.. కిలో రూ.100 - MicTv.in - Telugu News
mictv telugu

కొండెక్కిన ఉల్లి ధరలు.. కిలో రూ.100

October 21, 2020

Onion Price In Telugu States

ఉల్లి కోయక ముందే జనం చేత కంటతడి పెట్టిస్తోంది. ఒక్కసారిగా ధరలు పెరగడంతో జనం గగ్గోలు పెడుతున్నారు. నిన్నా, మొన్నటి వరకు కిలో రూ. 30 పలకగా.. ప్రస్తుతం రూ. 80కు తాకింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా రూ. 100 కూడా పలుకుతోంది. దీంతో కొండెక్కిన ధరలు ఎప్పుడెప్పుడు దిగివస్తాయా అని ఆసక్తిగా చూస్తున్నారు. కరోనా కారణంగా చాలా మంది ఆదాయం తగ్గిపోయిన సమయంలో ధరలు పెరగడం జనాలను కలవరపెడుతోంది. 

మార్కెట్లో క్వింటా ఉల్లి 6 వేలకు పెరిగింది. నెల రోజుల క్రితమే రూ. 2 వేల లోపు ఉండగా అవి అమాంతం పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వానలకు ఉల్లి పాడైపోవడంతో కొరత ఏర్పడింది. ఇప్పట్లో పంట కూడా చేతికి వచ్చే అవకాశం లేకపోవడంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకుండా పోతోంది. గుజరాత్‌, మధ్యప్రదేశ్‌లలోనూ ఉల్లి ఎక్కువగానే సాగు అవుతోంది. అక్కడి నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నా ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా ఉల్లి పంట దెబ్బతింది. దీంతో ఉల్లిధర మరింత పెరగకుండా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.