బెంగళూరులో కిలో ఉల్లి రూ.200! - MicTv.in - Telugu News
mictv telugu

బెంగళూరులో కిలో ఉల్లి రూ.200!

December 8, 2019

Onion 02

దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బెంగళూరు కిలో ఉల్లి ధర ఏకంగా రూ.200కు పలుకుతోంది. ‘రిటైల్ షాపుల్లో ధరలు భారీగా పెరిగాయి. హోల్‌సేల్ వ్యాపారులు క్వింటాలుకు రూ.14 వేలు పెట్టి ఉల్లిని కొనుగోలు చేయాల్సి వస్తోంది’ అని కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ ఆఫీసర్ సిద్ధనాగయ్య వ్యాఖ్యానించారు. 

బెంగళూరులోని రెస్టారెంట్లు, హోటళ్లు ఇప్పటికే ఉల్లిపాయల వాడకాన్ని తగ్గించాయి. టిఫిన్ సెంటర్ల మెనూలో నుంచి ఉల్లి దోష మాయం అయింది. ఇండియాకు సంవత్సరానికి 150 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయల అవసరం ఉంటుంది. ఒక్క కర్ణాటకలోని ఏటా 20.9 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండుతుంది. కాగా, ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు ఎక్కువగా పంట తడిసిపోయింది. దీంతో మార్కెట్లో డిమాండ్, సరఫరాల మధ్య సమతుల్యత దెబ్బతిందని వ్యాపారులు అంటున్నారు.