ఉల్లి దొంగల అరెస్ట్.. 58 సంచులు స్వాధీనం  - MicTv.in - Telugu News
mictv telugu

ఉల్లి దొంగల అరెస్ట్.. 58 సంచులు స్వాధీనం 

October 27, 2020

Farmers

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ఒక్కసారిగా రేట్లు పెరగడంతో సామాన్య జనం కొనడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత మంది కేటుగాళ్లు దోపిడీలకు తెగబడుతున్నారు. గతంలో చేసినట్టుగానే రైతుల పంట చేనుల నుంచి ఎత్తుకెళ్లారు. దీంతో పోలీసులు నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని పూణేలో ఇది జరిగింది. 

ఉల్లి ధరలు పెరగడంతో అక్రమంగా అమ్ముకునేందుకు నలుగురు వ్యక్తులు దోపిడీకి తెగబడ్డారు. రైతు నిల్వ ఉంచిన గోదాం తాళం పగుల గొట్టిన బస్తాలను వాహనంలో వేసుకొని వెళ్లిపోయారు. 58 బస్తాల్లో తీసుకెళ్లిన ఉల్లి దాదాపు రూ.2.35 లక్షల విలువ చేస్తుందని రైతు పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టి దొంగలను గుర్తించారు. వారి నుంచి ఉల్లిని స్వాధీనం చేసుకున్నారు. కొంత కాలంగా వారంతా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్టుగా తేల్చారు.