ఆధార్ కార్డు తాకట్టు పెడితే కిలో ఉల్లి - MicTv.in - Telugu News
mictv telugu

ఆధార్ కార్డు తాకట్టు పెడితే కిలో ఉల్లి

December 1, 2019

Onions ................

దేశవ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్కడక్కడా ఉల్లిపాయల దొంగతనాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల తలకు హెల్మెట్‌లు ధరించి ఉల్లిని విక్రయిస్తున్నారు. కొన్ని హోటళ్ల మెనూ నుంచి ఉల్లి దోష మాయం అయింది. 

ఇదిలా ఉంటే ఉల్లి ధరలకు నిరసనగా వారణాసిలో సమాజ్‌వాదీ కార్యకర్తలు వినూత్నంగా నిరసనకు దిగారు. ఆధార్‌కార్డు తాకట్టు పెట్టుకొని కిలో ఉల్లిపాయలను అప్పుపై విక్రయిస్తున్నారు. ఆధార్‌తో పాటు వెండి వస్తువులను కూడా తాకట్టు పెట్టుకొని ఉల్లిపాయలు అమ్మడం గమనార్హం. దేశంలో పెరిగిన ఉల్లి ధరలపై తమ నిరసన తెలియజేయడానికి ఈ పద్ధతిని చేపట్టామని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు తెలిపారు. కొన్ని దుకాణాల్లో ఉల్లిపాయలను లాకర్‌లలో పెట్టి అమ్ముతున్నారని, ప్రభుత్వం సామాన్యుడి కష్టాలను వినేందుకు సిద్ధంగా లేదని ఆరోపించారు.