ఉల్లి తెచ్చిన తంటా..హెల్మెట్లు పెట్టుకొని విక్రయం  - MicTv.in - Telugu News
mictv telugu

ఉల్లి తెచ్చిన తంటా..హెల్మెట్లు పెట్టుకొని విక్రయం 

November 30, 2019

Onions .....

ఉల్లి కోస్తేనే కాదు.. కొనాలన్నా కన్నీళ్లు వస్తున్నాయి. పెరిగిన ధరలతో ఈ పరిస్థితి దాపురించింది. ఇప్పుడు కొంటేనే కాదు వాటిని విక్రయించాలన్నా కష్టంగా మారిపోయింది. ఉల్లి కష్టాలు విక్రయదారులకు ఇబ్బందిగా మారింది. పెద్ద ఎత్తున వినియోగదారులు వస్తుండటంతో తోపులాట, రాళ్లు విసరడం జరగడతో హెల్మెట్లు పెట్టుకొని విక్రయిస్తున్నారు. బిహార్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

ఉల్లి కష్టాలు బిహార్‌లో మరింత దారుణంగా ఉన్నాయి. దీని నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు  స్టేట్ కార్పొరేటీవ్ సొసైటీ ఆధ్వర్యంలో కిలో ఉల్లిని రూ.35కే అందిస్తోంది. ఇదే కొత్త తంటా తెచ్చిపెట్టింది. ఉల్లి కొనేందుకు కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. ఎగబడి మరి కొనుక్కునే ప్రయత్నాలు చేశారు. దీంతో హడలిపోయిన విక్రయదారులు ఎవరైన ఆవేశంతో దాడికి పాల్పడతారేమోనని హెల్మెట్లు ధరించి అమ్ముతున్నారు. కౌంటర్ల వద్దకు ప్రజలు ఎక్కువగా వస్తున్న వారిని అదుపుచేసే యంత్రాంగం లేదని వారు వాపోతున్నారు. ఇక ఏం చేయలేక తామే ఇలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్టు చెప్పారు.