ఉల్లి చోరీ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కారు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఉల్లి చోరీ చేస్తూ సీసీ కెమెరాకు చిక్కారు (వీడియో)

December 11, 2019

Onions 02

ఇప్పటి వరకు బంగారం దొంగతనం కేసుల గురించి వింటూ వచ్చాం. ఎక్కువ ధరల కారణంగా  కానీ ప్రస్తుత రోజుల్లో బంగారం కంటే ఉల్లి చోరీ కేసులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏదో ఒక చోట ఉల్లిని ఎత్తుకెళ్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి పోలం నుంచే పంటను మాయం చేయగా తాజాగా మహారాష్ట్రలో మరో చోరీ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా డబుల్ సెంచరీ కొడుతుండటంతో ఈ పరిణామాలు సంభవించడం విశేషం. 

ప్రస్తుతం ఉల్లిని కొనాలంటే సామాన్యులే కాదు.. సంపన్నులు కూడా జంకుతున్నారు. కొంత మంది అయితే పెరిగిన ధరల కారణంగా కొనడం మాట అటుంచి చోరీకి పాల్పడుతున్నారు. ఎంత డబ్బు పెట్టినా ఉల్లి దొరకని పరిస్థితికి రావడంతో మహారాష్ట్రలోని డోంగ్రీ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు రాత్రిపూట దుకాణాల్లో ఉల్లి దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఈ నెల 5న రూ. 21,160ల విలువచేసే 168 కిలోల ఉల్లిగడ్డను దొంగతనం చేశారు. ఈ తతంగం అక్కడే ఉన్న ముందున్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. దాని ఆధారంగా దొంగతనం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.