శబరిమల భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో బుకింగ్.. - MicTv.in - Telugu News
mictv telugu

శబరిమల భక్తులకు శుభవార్త.. ఆన్‌లైన్‌లో బుకింగ్..

October 30, 2019

Sabarimala ..

శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇబ్బంది కలకుండా ఉండేందుకు  ఆన్‌లైన్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. www.sabarimalaonline.org లో భక్తులు తమ యాత్ర కోసం ముందుగానే బుకింగ్ చేసుకునే వీలు కల్పించారు. నవంబర్ 8 నుంచి ఈ సేవలను  ప్రారంభించనున్నారు. దీనికోసం గుర్తింపు కార్డును జతచేసి వివరాలను పొందుపరచాలని ఆలయ అధికారులు తెలిపారు. యాత్ర తేదీ, సమయం ఆధారంగా క్యూ కూపన్ వస్తుంది. దాని ఆధారంగా ఎంచుకున్న సమయానికి భక్తులు దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించనున్నారు.

ఈ బుకింగ్ ప్రతి వ్యక్తి పేరు, వయస్సు,చిరునామా,ఫొటో, గుర్తింపు కార్డును స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఓకే కుటుంబం నుంచి వచ్చే వ్యక్తులు అయినా విడివిడిగా బుకింగ్ చేసుకోవాల్సిందే. విద్యార్థులు అయితే  స్కూలు ఐడీ కార్డును జతచేయాలి. దర్శనానికి వెళ్లిన రోజున కచ్చితంగా వీటిని తీసుకురావాలని సూచించారు. అయితే ఐదేళ్లలోపు ఉన్న పిల్లలకు మాత్రం బుకింగ్ అవసరం లేదు. బుకింగ్ అయిన తర్వాత వచ్చే కూపన్‌తో పాటు గుర్తింపు కార్డును వెంట తీసుకువెళ్లాలి. అందులో చూపించిన సమయానికి క్యూ కౌంటర్ దగ్గరకు వెళితే దర్శనం కోసం లోపలికి పంపించనున్నారు.