Home > Featured > లవర్ కోసం వచ్చాడు.. పెళ్లి చేసి పడేశారు.. 

లవర్ కోసం వచ్చాడు.. పెళ్లి చేసి పడేశారు.. 

Online love story comes to an end with forced marriage in Odisha’s Balasore

కాగల కార్యం గంధర్వులే తీర్చడం అంటే ఇదేనేమో. వారిద్దరు ప్రేమించుకున్నారు. ఫేస్‌బుక్‌లో చిగురించింది వారి ప్రేమ. చాటింగ్‌లు, ఫోన్‌లో సంభాషణలు కొనసాగించారు. ప్రత్యక్షంగా కలుద్దాం అనుకున్నారు కానీ, కొన్ని కారణాలతో కుదరలేదు. దీంతో ఓరోజు ప్రియురాలి ఇంటికి వెళ్లాడు ప్రియుడు. ఇద్దరు ఏకాంతంలో మాట్లాడుకుంటుండగా అమ్మాయి తరఫు పెద్దవాళ్లు చూశారు. వెంటనే వారి పెళ్లి ఫిక్స్ చేసి బాజాభజంత్రీలు మోగించారు. దీంతో ఆ ప్రేమికులు పెద్దలను ఎలా ఒప్పించాలి? పారిపోవాలా? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలా? ఇలాంటివి ఎన్నో ప్రశ్నలకు వారికి చాలా సింపుల్ సమాధానం లభించడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఇంతకీ వారి ప్రేమ ఎలా చిగురించిందో తెలుసుకుందాం. ఒడిశాలోని బాలేశ్వర్ జిల్లా గులునియా గ్రామానికి చెందిన సురేంద్ర బెహెరా కుమార్తె, కుబబపాట్న గ్రామానికి చెందిన బై కుంటకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. స్నేహంతో మొదలైన వారి బంధం చాటింగ్ సాక్షిగా ప్రేమకు దారితీసింది. అనంతరం ఇరువురు ఫోన్ నెంబర్లు ఇచ్చుకున్నారు. కొద్దిరోజులుగా కలవాలని అనుకున్నారు. అయితే ఇంట్లో కుటుంబసభ్యులు ఉండడం.. ఇతరత్రా కారణాలతో కలవలేకపోయారు. సెప్టెంబర్ 12వ తేదీ గురువారం ఇంట్లో ఎవరూ లేరని అమ్మాయి.. ప్రియుడికి చెప్పింది. దీంతో అతడు ఆమె ఇంటికి వచ్చాడు. ఏకాంతంలో ఇద్దరూ కబూర్లు చెప్పుకుంటున్నారు.

ఇంతలో వారిని చుట్టుపక్కలవారు గమనించారు. వెంటనే అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పారు. వారిని రెడ్ హ్యాడెండ్‌గా పట్టుకుని, వారిమధ్య వున్న ప్రేమ నిజమేనా అని నిలదీశారు. నిజమే అని వారిద్దరూ చెప్పారు. అప్పటివరకు వారి గుండెల్లో భయం గడగడలాడుతోంది. అందరూ కలిసి తమకు వేయరాని శిక్ష వేస్తారేమోనని బిక్కుబిక్కుమన్నారు. కానీ, వారు ఊహించింది ఏం జరగలేదు. అక్కడ సీన్ రివర్స్ అయింది. మన్మథుడు పూలబాణాన్ని వారి మనసుల్లో వదిలినట్టు వారంతా వారికి పెళ్లి చేయాలని నిశ్చయించారు. ఇంటికి వచ్చిన అబ్బాయిని అల్లుడిని చేసుకున్నారు. వారి సంప్రదాయం ప్రకారం వివాహం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇలాంటి అప్రయత్న పనులు సఫలం అయినప్పుడే కాగల కార్యం గంధర్వులు తీర్చారని మన పెద్దలు అనుండొచ్చు.

Updated : 14 Sep 2019 9:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top