ఆర్టీసీ సమ్మెకు ఆన్‌లైన్‌లో పెరుగుతున్న మద్దతు.. రాష్ట్రపతికి లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్టీసీ సమ్మెకు ఆన్‌లైన్‌లో పెరుగుతున్న మద్దతు.. రాష్ట్రపతికి లేఖ

October 14, 2019

telangana rtc ..

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సోషల్ మీడియాలో మద్దతు పెరుగుతోంది. ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు కార్మికులకు అండగా ముందుకొస్తున్నాయి. ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆన్ లైన్‌లో సంతకాల సేకరణ కూడా జోరందుకుంది. ఉద్యోగ భద్రత కోసం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటున్న కార్మికుల సమస్యలను వివరిస్తూ సమ్మె మద్దతుదారులు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు ఆన్‌లైన్‌లో లేఖ రాశారు. సంతకాల సేకరణకు వాడే చేంజ్.ఆర్గ్‌లో మద్దతు కోరుతూ పిటిషన్ ఉంచారు. 

http://chng.it/dsB5q2BF

‘తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. 50వేల మంది డ్రైవర్లు, కండకర్లు, ఇతర ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ప్రజా రవాణా సంస్థను కాపాడుకోడానికి ఉద్యమిస్తున్నారు. వారి 26 డిమాండ్లలో అత్యధికం వారి జీతభత్యాలకు సంబంధించినవి కానే కావు. ప్రజారవాణా వ్యవస్థను బలోపేతం చేయాలని వారు కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన హామీనే నెరవేర్చాలంటున్నారు. ఆర్టీసీ కార్మికుల సగటు జీతం రూ. 20వేల కంటే తక్కువే ఉంది. ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి రూ.2,822 కోట్ల బకాయిలు రావాల్సి ఉండగా, కేవలం రూ. 638 కోట్లే చెల్లించారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడపాలని, డీజిల్ పై పన్నును మినహాయించాలని కోరుతున్నారు.. వారు చట్టప్రకారమే సమ్మె చేస్తున్నారు. ముందుగానే నోటీసు ఇచ్చారు. కానీ ప్రభుత్వం స్పందించలేదు. సమ్మెలో పాల్గొంటే ఉద్యోగాలు ఊడిపోతాయని సీఎం హెచ్చరించారు. ఒక కలం పోటుతో 48వేల మంది కార్మికులను తీసేశారు.. కానీ కార్మికులు ఇలాంటి అణచివేత చర్యలకు భయపడకుండా సమ్మె సాగిస్తున్నారు. దయచేసి అందరూ సమ్మెకు మద్దతివ్వండి.. ’ అని పిటిషన్  కోరారు.