అడవి కోసం ఆన్‌లైన్ ఉద్యమం.. నల్లమలపై లక్షల సంతకాలు - MicTv.in - Telugu News
mictv telugu

అడవి కోసం ఆన్‌లైన్ ఉద్యమం.. నల్లమలపై లక్షల సంతకాలు

September 13, 2019

తెలుగు ప్రాంతాల్లో మళ్లీ ఉద్యమం రగులుకుంటోంది. ప్రత్యేక తెలంగాణ, విశాఖ ఉక్కు, ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమాలను తలపించేలా మరో ఆందోళన రూపుదిద్దుకుంటోంది. అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతూ అడవి కోసం పిడికిలి బిగించి గర్జిస్తోంది. అటు ఏపీ, ఇటు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో ‘సేవ్ నల్లమల’ అని నినదిస్తున్నారు. కాలుష్యం, విషయం, రోగాలు మాకొద్దని, స్వచ్ఛమైన గాలి, నీళ్లు కావాలని కోరుతున్నారు.

రెండు రాష్ట్రాల్లో విస్తరించిన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ యత్నాలను సామాన్యుల నుంచి సెలబ్రిటీల వల్ల ‘తెలుగు రాష్ట్రాల ఊపిరితిత్తుల’ కోసం కదులుతున్నారు. సభలు, సమావేశాలు, కరపత్రాలే కాకుండా సోషల్ మీడియాలోనూ సేవ్ నల్లమల ఉధృత రూపం దాలుస్తోంది. ఆన్‌లైన్  సంతకాల ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. సామాజిక సమస్యలపై సంతకాల సేకరించే change.org‌లో పలువురు పిటిషన్లపై సంతకాలు సేకరిస్తున్నారు. లక్షమందికి పైగా ఇప్పటికే వీటిపై సంతకాలు చేశారు.