మసీదుల్లోకి మహిళల ప్రవేశం.. కేసును విచారిస్తాం - MicTv.in - Telugu News
mictv telugu

మసీదుల్లోకి మహిళల ప్రవేశం.. కేసును విచారిస్తాం

April 16, 2019

దేశ సర్వోత్తమ న్యాయస్థానం సుప్రీం కోర్టు.. మరో సంచలన తీర్పుకు వేదిక కానుందా? పరిణామాలు చూస్తే అలానే అనిపిస్తున్నాయి. మసీదుల్లో ప్రార్థనలు జరపడానికి ఆడవారిని కూడా అనుమతించాలని కోరుతూ మహారాష్ట్రలోని పుణెకు చెందిన ముస్లిం దంపతులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మతం, కులం, వర్ణ, లింగ వివక్షలు చూపడం సరికాదని అందుకే భారతదేశంలోని ముస్లిం మహిళలను ప్రార్థనల నిమిత్తం మసీదుల్లోకి అనుమతించాలని పిటిషన్లో తెలిపారు.

"Only Because Of Sabarimala": Top Court To Hear Plea On Women In Mosques

ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీం ప్రపంచంలో ఏ దేశమైన ముస్లిం మహిళలను మసీదులోకి అనుమతిస్తుందా అని పిటిషనర్ తరపు లాయర్లను ప్రశ్నించింది. దానికి వారు కెనడా, మక్కా దేశాలలో ముస్లిం మహిళలను మసీద్‌లోకి అనుమతిస్తున్నాయని తెలిపారు. దీనితో ఈ అంశమై తన స్పందన తెలపాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే శబరిమలై అంశంలో తీర్పు ఇవ్వడం వలనే ఈ పిటిషన్ కూడా స్వీకరించాల్సి వచ్చిందని ఎస్ఏ బొబ్దే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ అంశమై సుప్రీం కోర్టు తీర్పు కోసం ముస్లిం మహిళ్లకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.