టెట్ రాయడానికి వీళ్లు మాత్రమే అర్హులు:కన్వీనర్ - MicTv.in - Telugu News
mictv telugu

టెట్ రాయడానికి వీళ్లు మాత్రమే అర్హులు:కన్వీనర్

March 25, 2022

bvc

తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కేసీఆర్ ప్రభుత్వం తాజాగా తీపికబురు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి.. అభ్యర్థులు మార్చి 26 నుంచి ఏప్రిల్ 12 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని పేర్కొంది. జూన్ 12న పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. అయితే, తెలంగాణలో 7 ఏళ్ల తర్వాత టెట్ నోటిఫికేషన్ రావడంతో ఉపాధ్యాయ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఈసారి నిర్వహించే టెట్.. కాలపరిమితి జీవిత కాలానికి పొడిగిస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ సందర్భంగా కన్వీనర్ రాధారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టెట్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ”ఉపాధ్యాయుల నియామకానికి ముందు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సంబంధించిన పూర్తి సమాచార బులెటిన్, సిలబస్‌ను విడుదల చేశాం. 2017 టెట్ సిలబస్ ప్రకారమే పరీక్షలను నిర్వహిస్తాం.

ఈసారి బీఈడీ, డీఎల్‌ఈడీ చివరి సంవత్సరం విద్యార్ధులు కూడా టెట్ రాసేందుకు అవకాశం కల్పించాం. పేపర్-1, పేపర్-2 రెండింటికీ కలిపి రుసుము రూ.300గా నిర్ణయించాం. మార్చి 26 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. జూన్ 12న టెట్ పరీక్ష జరుగుతుంది. జూన్ 27న ఫలితాలను వెల్లడిస్తాం. టెట్‌కు సంబంధించి మార్చి 28 నుంచి హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభిస్తున్నాం” అని ఆయన అన్నారు. tstet.cgg.gov.in వెబ్‌సైట్‌లో పరీక్షకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ రాధా రెడ్డి తెలిపారు.