ఎఫ్ 3 నుంచి 'ఊ ఆ అహ అహ' పాట మేకింగ్ వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

ఎఫ్ 3 నుంచి ‘ఊ ఆ అహ అహ’ పాట మేకింగ్ వీడియో

April 26, 2022

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంతకు ముందు ఎఫ్2 అనే సినిమా వచ్చి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రానికి కొనసాగింపుగా ఎఫ్3 వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ‘ఊ ఆ అహ అహ’ అనే పాట లిరిక్స్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఆ సాంగ్ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

శేఖర్ మాస్టర్ నృత్య దర్శకత్వంలో రూపొందిన ఈ పాటలో వెంకటేష్ – తమన్నా, వరుణ్ తేజ్ – మెహరీన్‌లతో పాటు సోనాల్ చౌహాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అంతేకాక, ఈ పాట చిత్రీకరించేటప్పుడు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సెట్స్‌కి వచ్చి పాట మేకింగుని గమనించారు. ఈ సినిమాలో భార్యల విలాసవంతమైన కోరికలు తీర్చడానికి భర్తలు పడే అవస్థలను దర్శకుడు చాలా ఫన్నీగా చూపించబోతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మే 27న విడుదలవుతోంది. రాజేంద్ర ప్రసాద్, సునీల్, మురళీ శర్మ, సంగీత, అంజలి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే ప్రత్యేక గీతంలో నర్తించనుంది.