అయ్యయ్యో బట్లర్.. ప్రపంచ రికార్డ్ మిస్ అయ్యిందే.. - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యయ్యో బట్లర్.. ప్రపంచ రికార్డ్ మిస్ అయ్యిందే..

June 18, 2022

ఇంగ్లాండు ఆటగాడు జోస్ బట్లర్ అంటే తెలియని క్రికెట్ ప్రియులు ఉండరు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్‌ల్లో రాజస్తాన్ రాయల్స్ తరుపున మెరుపు షాట్‌లతో సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టి, ప్రేక్షకుల చేత ఈలలు వేయించాడు. తాజాగా బట్లర్‌కు సంబంధించి నెట్టింట ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ‘అయ్యయ్యో బట్లర్ కొద్దిలో ప్రపంచ రికార్డ్ మిస్ అయ్యిందే’ అంటూ నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.

తాజాగా ఇంగ్లాండు- నెదర్లాండ్స్  జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో బట్లర్.. 65 బంతుల్లో 150 పరుగులు చేసి, త్రుటిలో ప్రపంచ రికార్డును మిస్ చేసుకున్నాడు. గతంలో తన పాత రికార్డును తానే బద్దలు కొట్టుకున్నాడు. ”2010లో వెస్టిండీతో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ (150,77 బంతుల్లో 13×4, 12.6) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అప్పుడు 70 బంతుల్లో 150 పరుగులు చేయడంతో స్ట్రైక్ రేట్ 194.80గా నమోదైంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 418/6 భారీ స్కోర్ చేసింది.”

వన్డే క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో 150 పరుగులు సాధించిన ఆటగాడుగా ఏబీ డివిలియర్స్ ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ‘2015లో వెస్టిండీతో జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియర్స్.. కేవలం 64 బంతుల్లోనే 150 పరుగులు చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు. వన్డే క్రికెట్లో వేగవంతమైన 150 స్కోర్ సాధించిన ఆటగాడిగా ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచాడు.’ ఈ క్రమంలో శుక్రవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో బట్లర్.. 65 బంతుల్లోనే 150 పరుగులు చేశాడు. ఇంకో రెండు తక్కువ బంతుల్లోనే 150 పరుగులు సాధించి ఉంటే గనుక, ఏబీ డివిలియర్స్‌ను అధిగమించి, వన్డే మ్యాచ్‌ల్లో కొత్త చరిత్ర సృష్టించేవాడు. కొద్దిలోనే ఆ అవకాశాన్ని కోల్పోవడంతో బట్లర్ అభిమానులు, క్రికెట్ ప్రియులు నిరాశకు గురయ్యారు.