oorvasivo review
mictv telugu

ఊర్వశివో రాక్షసివో రివ్యూ

November 4, 2022

కెరీర్లో ఒక్కటంటే ఒక్క మంచి హిట్ కోసం ఎదురుచూస్తూ అడపా దడపా సినిమాలు చేస్తున్న అల్లు శిరీష్‌తాజా చిత్రం ఊర్వశివో రాక్షసివో పై బాగనే ఆశలు పెట్టుకున్నాడు. ట్రైలర్‌తో ఆడియెన్స్‌ లోనూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు. మరీ చిత్రంతో అయినా అల్లు శిరీష్‌ సక్సెస్‌ సాధించాడా? ప్రేక్షకులని ఆకట్టుకోగలిగాడా అనేది చూద్దాం.

కథ విషయానికొస్తే..

శ్రీకుమార్‌(అల్లు శిరీష్‌) ఓ మిడిల్ క్లాస్‌ అబ్బాయి. సింధూజ(అను ఇమ్మాన్యుయేల్) అమెరికాలో పెరిగి ఇక్కడికొచ్చి సాఫ్ట్ వేర్ జాబ్ చేసే అమ్మాయి. ఒకే ఆఫీస్‌ లో కలిసి పనిచేస్తుండడంతో సింధూజను ప్రేమిస్తాడు శ్రీ. కొద్దిటైమ్‌ లోనే సింధూజ కూడా శ్రీని లవ్‌ చేయడంతో శారీరకంగా ఒక్కటయ్యాక శ్రీ పెళ్లి ప్రపోజల్‌ పెడతాడు. కానీ సింధూజ మాత్రం శ్రీని ప్రేమించడం లేదనీ, పెళ్లి అనే ఆలోచనే తనకు లేదని చెప్తుంది. దాంతో ఒకరినొరకు మరింతగా తెలుసుకుందామని లివిన్‌ ప్లాన్ చేస్తారు. మరి ఆ విషయం శ్రీ ఇంట్లోవాళ్లకి తెలిసిందా?
చివరిగా ప్రేమ, పెళ్లిమీద ఎవరి అభిప్రాయాలు ఎలా మారాయి అనేదే అసలు కథ.

ఓవరాల్‌ గా ఎలా ఉందంటే..

ప్రేమ, పెళ్లి, లివ్ ఇన్, బ్రేకప్స్, డ్రీమ్స్‌, గోల్స్‌.. ఇలా పస్తుత రోజుల్లో యువత తాలూకు ఆలోచనలు, మారుతున్న అభిప్రాయాల
నేపథ్యంతో తెరకెక్కిన సినిమా ఇది. రొమాంటిక్‌ సీన్స్‌, కామెడీ సన్నివేశాలు యూత్‌ ఆడియెన్స్‌ ని అలరించినా అక్కడక్కడా (కష్టపడి ప్రయత్నించిన) భావోద్వేగాలతో పర్వాలేదనిపిస్తుంది మూవీ. క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకునేలా సునీల్‌ డైలాగ్స్‌, ఓటీటీ వెబ్ సిరీస్‌ ఫ్యాన్స్‌కు కనెక్టయ్యేలా వెన్నెల కిషోర్ పంచులు చాలాచోట్ల బాగా పేలాయి. రొటీన్‌ క్లైమాక్స్‌ కాకుండా కాస్త కొత్తగా ప్రయత్నించాలని చూసినా ఆఖరికి మళ్లీ అదే ఫీల్‌ కలుగుతుంది. యూత్‌ ఆడియెన్స్‌ ని టార్గెట్‌ చేసి తీసిన చిత్రం కాబట్టి కొన్నిచోట్ల అడల్డ్‌, డబుల్‌ మీనింగ్ డైలాగులు కూడా వినిపిస్తాయి. ‘ఈరోజుల్లో లైసెన్స్‌, ఆర్సీ ఎవరడుగుతున్నారండీ హెల్మెట్‌ ఉంటే చాలు’. ‘ నీ బ్యాటుకో దండం’, ‘ డే అండ్ నైట్ మ్యాచ్, బ్యాటింగ్ లో దూకుడు’ లాంటి డైలాగ్స్‌ యూత్‌ ప్రేక్షకుల కోసమే రాసినట్టనిపిస్తుంటుంది. మామూలుగా ఇలాంటి నేపథ్యమున్న సినిమాలకు పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ బాగా కుదిరితే ఆడియెన్స్‌ ఇంకాస్త కనెక్టయ్యే అవకాశాలుంటాయి. కానీ ఈ చిత్రంలో మ్యూజిక్‌ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. కొన్నిచోట్ల స్లో నేరేషన్‌ వల్ల అక్కడక్కడా బోర్ అనిపించినా కామెడీ అండ్ రొమాంటిక్ సీన్స్‌ తో బానే లాక్కొచ్చాడు దర్శకుడు రాకేష్‌ శశి.

నటీనటుల పనితీరు

హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోడానికి చాలా రోజులుగా కష్టపడుతున్న అల్లు శిరీష్‌ ఈ చిత్రంతో ఓకే అనిపించుకున్నా నటుడిగా
కెరీర్‌ ను మలుపు తిప్పే ఫలితమైతే దక్కలేదనే చెప్పాలి. హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ పాత్రమేరకు బాగానే నటించినా, గత చిత్రాలైన నా పేరు సూర్య, అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ల తర్వాత కొంతలో కొంత రిలీఫ్‌నిచ్చిందీ సినిమా. సునీల్‌, వెన్నెల కిషోర్ తెరపై కనిపించినప్పుడల్లా నవ్వులు పండిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టెయిన్ చేశారు. పృథ్వీ, ఆమని, పోసానితో పాటు మిగతా నటులు కూడా పాత్ర పరిధిలో బానే చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ కాకుండా యూత్‌ ప్రేక్షకులు మాత్రం ఈ రొమాంటిక్ అండ్ కామెడీని ఓసారి చూసి ఎంజాయ్‌ చేయొచ్చు.