రోడ్లపైన సిగరెట్ కాలిస్తే.. ఠాణాకు పట్టుకుపోతారు.. - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్లపైన సిగరెట్ కాలిస్తే.. ఠాణాకు పట్టుకుపోతారు..

February 1, 2018

బహిరంగ ప్రదేశంలో ధూమపానంపై నిషేధమున్న సంగతి తెలిసిందే. అయితే చాలామంది పొగరాయుళ్లు ఖాతరు చేయడం లేదు. తమ ఆరోగ్యాలతోపాటు ఇతరుల ఆరోగ్యాలకూ పొగబెడుతున్నారు. పోలీసులు కూడా ఎంతమందిని పట్టుకుంటాం అని ఉసూరుమంటూ ఉంటారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హైదరాబాద్ పోలీసులు బహిరంగ పొగపై ఉక్కుపాదం మోపుతున్నారు.బుధవారం నగరంలోని పలు బస్ స్టాపులు, హోటళ్లు, పాన్‌ డబ్బాలు, పార్కులు, క్రీడా మైదానాల్లో దాడులు నిర్వహించారు. సిగరెట్లు, బీడీలు కాలుస్తున్న 25 మందిని అదుపులోకి తీసుకుని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత వారికి స్థానిక ప్రజాప్రతినిధులతో కౌన్సెలింగ్‌ ఇప్పించారు.  అంతేకాకుండా వారిపై టొబాకో యాక్టు కింద కేసులు పెట్టారు. మళ్లీ రోడ్లపైన పొగతాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ ధూమపాన నిషేధచట్టం ప్రకారం.. ఈ నేరానికి పాల్పడితే రూ.200 జరిమానా పడుతుంది. జరిమానాతోపాటు కౌన్సెలింగ్, ఇతర చర్యల ద్వారా వీరికి అడ్డుకట్ట వేయాలని పోలీసులు యోచిస్తున్నారు.