ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశాలలో, రెండు సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని వ్యతేరేకిస్తూ, ప్రతిపక్షాలు నినాదాలు చేశాయి. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడలేని గవర్నర్ గో బ్యాక్ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగం ప్రతులను టీడీపీ సభ్యులు చించేవేశారు. దీంతో ప్రతిపక్షనేతల తీరుపై జగన్ మండిపడ్డారు.
మరోపక్క రేపు (మంగళవారం) మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి ఉభయ సభలు సంతాపం తెలపనున్నాయి. సంతాప తీర్మానం అనంతరం సమావేశం ముగుస్తుంది. 11వ తేదీన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి కన్నబాబు ప్రవేశపెడుతారు. ఈ సారి దాదాపు రెండున్నర లక్షల కోట్లతో ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సోమవారం జరుగనున్న బీఏసీ భేటీలో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు.