Operation under torchlight in uttar pradesh
mictv telugu

ఇంకెన్నాళ్లీ దురవస్థ.. టార్చ్‌లైట్ల వెలుతురులో ఆపరేషన్.. వీడియో

September 12, 2022

కరెంటు లేక టార్చ్ లైట్ల వెలుతురులో రోగికి ఆపరేషన్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్‌లో వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ జిల్లా స్థాయి ఆసుపత్రిలో కరెంటు పోగా, వైద్యులు ఫోన్ టార్చ్ లైట్ల వెలుగులో ఆపరేషన్ చేశారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. బలియా జిల్లాలోని ఆసుపత్రిలో ఆదివారం భారీ వర్షం కారణంగా విద్యుత్ నిలిపివేశారు. దాంతో మొత్తం చీకటి ఏర్పడగా, విధిలేక డాక్టర్లు చీకట్లోనే ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. వీడియో ప్రకారం.. ఓ మహిళ స్ట్రెచర్‌పై ఉండగా, వైద్యుల బృందం ఆమె చుట్టూ ఉన్నట్టు కనిపిస్తుంది. అందులోని ఓ డాక్టరు ఫోన్ పట్టుకొని టార్చ్ లైట్ వేయగా, ఆ వెలుగులో వైద్యుల బృందం మహిళకు ఆపరేషన్ చేశారు. దీనిపై వివరణ కోరితే.. ఆర్థోపెడిక్ సర్జన్, చీఫ్ ఇంచార్జీ డాక్టర్ ఆర్ డి రామ్ ఏం జరిగిందో వివరించారు. కరెంటు పోయినప్పుడు జనరేటర్ ఆన్ చేశామని, కానీ అందులో బ్యాటరీలు లేకపోవడంతో కాస్త జాప్యం జరిగిందని వివరించారు. బ్యాటరీలు ఎందుకు లేవని అడిగితే.. జనరేటర్‌లో బ్యాటరీలు ఉంచితే చోరీకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ భయంతో పెట్టలేదని చెప్పుకొచ్చారు.