25ఎంపీ..  ఒప్పో ఎఫ్7  వచ్చేసింది.. - MicTv.in - Telugu News
mictv telugu

25ఎంపీ..  ఒప్పో ఎఫ్7  వచ్చేసింది..

March 26, 2018

సెల్ఫీ కెమెరాలకు మారుపేరుగా మారిపోయిన ఒప్పో మరో సంచలన ఫోన్‌ను మార్కెట్లోకి వదిలింది. ఎఫ్7 పేరుతో దీన్ని సోమవారం షాపుల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఎరుపు, తెలుపు, డైమండ్‌ బ్లాక్‌, సన్‌రైజ్‌ రెడ్‌ వెర్షన్లలో లభిస్తోంది. ఫోన్‌కు ముందు భాగంలో 25 ఎంపీ కెమెరా అమర్చారు. ధర రూ. 21,990. బ్యూటీ 2.0 ద్వారా గతంతో పోలిస్తే ఫేసియల్‌ రికగ్నిషన్‌ మరింత కచ్చితంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఒప్పో ఎఫ్7ను 6జీబీ ర్యామ్, 128జీబీ రోమ్ వేరియంట్లో తీసుకొచ్చారు. వెనుకవైపు 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.  ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి పైభాగంలో నాట్చ్‌ తరహాలో డిస్‌ప్లేతో తయారు చేశారు. ఏప్రిల్ 2న ఫ్లిప్‌కార్ట్‌లో ఆన్‌లైన్ సేల్ ద్వారా అందుబాటులోకి రానుంది. వివో వీ9, మోటో ఎక్స్‌ 4, హానర్‌ 8 ప్రొ మోడళ్లకు ఇది గట్టిపోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

ఒప్పో ఎఫ్ 7 ఫీచర్లు

డిస్‌ప్లే: 6.23 అంగులాల ఫుల్ హెచ్‌డీ, మెమొరి: 4జీబీ-64జీబీ, 6జీబీ-128జీబీ, కెమెరా: వెనక వైపు 16ఎంపీ, ముందు 25ఎంపీ, బ్యాటరీ: 3400 ఎంఏహెచ్, నెట్‌వర్క్ టైప్: 4జీ వోల్టీ. 19:9 నిష్ఫత్తిలో 6.23 అంగుళాల ఫుల్‌ స్ర్కీన్‌ డిస్‌ప్లే, ముందువైపు 25 మెగా పిక్సల్‌‌ కెమెరా(సోనీ ఐఎంఎక్స్ సెన్సార్).