యువతకు ప్రత్యేకం..ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

యువతకు ప్రత్యేకం..ఒప్పో నుంచి మరో స్మార్ట్‌ఫోన్

January 16, 2020

OPPO F15.

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ ఒప్పో..’ఒప్పో ఎఫ్‌ 15′ పేరుతో గురువారం కొత్త ఫోన్‌‌ను విడుదల చేసింది. వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిజైన్‌తో అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తున్న ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో బ్యూటిఫికేషన్‌, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ట్‌, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్, వూక్‌ 3.0 ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఫీచర్లు ఉన్నాయి. ధర విషయానికి వస్తే రూ. 19,990గా నిర్ణయించారు. ఈ ఫోన్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా వెబ్‌సైట్‌లలో లభించనుంది. మొదటి ఫ్లాష్ సేల్ జనవరి 24న జరగనుంది. లాంచింగ్ ఆఫర్ కింద వన్-టైమ్ స్క్రీన్ రీప్లేస్‌మెంట్, హెచ్‌డిఎఫ్‌సి కార్డ్ వినియోగదారులకు 10 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. 

 

ఒప్పో ఎఫ్‌15 ఫీచర్లు

 

* 6.4 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే,

* ఆండ్రాయిడ్‌ 9 పై,

* 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌,

* 48+8+2+2ఎంపీ రియర్‌ క్వాడ్‌ కెమెరా,

* 16 ఎంపీ సెల్ఫీకెమెరా,

* 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ.