ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు సంస్థ అయిన ఒప్పోతన కొత్త ఫోన్ లాంచ్ డేట్ ప్రకటించింది. గతకొన్నాళ్లుగా వస్తున్న రూమర్స్ కు చెక్ పెడుతూ తన మడతపెట్టే ఫోన్ విడుదల తేదీని ప్రకటించేసింది. సామ్ సంగ్ తర్వాత ఒప్పో కంపెనీనే ఫోల్డబుల్ ఫోన్ను మార్కెట్లోకి తీసుకురావడం విశేషం. ఒప్పో ఫైండ్ ఎన్ 2 పేరుతో విడుదల అవుతున్న ఈ ఫోన్ ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. ఒప్పో ఫైండ్ ఎన్ 2 ఫోన్ ముఖ్యంగా సామ్‌సంగ్ జెడ్ ఫ్లిప్ 4తో పోటీ పడుతుందని అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి 15 న ఒప్పో ఫైండ్ ఎన్2 ఫోన్‌ను కంపెనీ విడుదల చేయనుంది. ఒప్పో ఎ 78, ఒప్పో రెనో 8 టి తర్వాత 2023లోమొదటిసారిగా కంపెనీ ఈ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఒప్పో ఫైండ్ ఎన్ 2 ధర రూ.82,999గా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఫీచర్లు
ఒప్పో కంపెనీ విడుదల చేసిన మడతపెట్టే ఫోన్ డిజైన్ కస్టమర్లను ఆకట్టుకునేలా ఉంది. ఈ ఫోన్ పింక్,బ్లాక్ రంగుల్లో అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ లో ప్రత్యేకత ఏంటంటే ఫోల్డ్ చేయకుండానే నోటిఫికేషన్లు ఫొటోలు చూసేలా డిజైన్ చేశారు.
– 6.8 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
– ఔటర్ డిస్‌ప్లే 3.62 అంగుళాలతో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.
-మిడియా టెక్ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 16 జీబీ+512 జీబీబీ వేరియంట్‌తో వచ్చే అవకాశం ఉంది.
– 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా సెటప్ ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
-5 జీ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్‌లో 44 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4300mahబ్యాటరీ ఉంటుంది.
– సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో పాటు ఇతర అడ్వాన్స్డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
– ఈ ఫోన్ ఇండియాలో 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
-ఈ ఫోన్ ధర కూడా రూ. 71,000గా ఉండవచ్చొనే అంచనా వేస్తున్నారు.