ఒప్పో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్..ధర ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

ఒప్పో నుంచి 5జీ స్మార్ట్ ఫోన్..ధర ఎంతంటే?

May 21, 2020

Oppo Find X2 Neo with 90Hz display arrives in Germany

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో కొత్తగా 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఇందులో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మొదలగు ఆకర్షణీయమైన ఫీచర్లను అమర్చింది. ఈ ఫోన్ లో అమర్చిన 90 హెడ్జ్ డిస్ప్లే ప్రధాన ఆకర్షణగా నిలువనుంది. కాగా, ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఫైండ్ ఎక్స్ 2 సిరీస్‌లో ఇది నాలగవ ఫోన్ కావడం విశేషం. ఇప్పటికే ఒప్పో ఫైండ్ ఎక్స్ 2, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 ప్రో, ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 లైట్ ఫోన్ లను ఒప్పో విడుదల చేసింది. కొత్తగా లాంచ్ చేసిన ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో ధర సుమారుగా రూ. 58,000 ఉంటుందని అంచనా. మొదట ఈ ఫోన్ ను జర్మనీ దేశ మార్కెట్ లో విడుదల చేసింది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది.

ఒప్పో ఫైండ్ ఎక్స్ 2 నియో ఫీచర్లు

 

* 6.5-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే,

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 765 జి ప్రోసెసర్,‌

* 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్,

* 48+13+ 8+2 మెగాపిక్సెల్ క్వాడ్‌ కెమెరా సెటప్,

* 44 మెగాపిక్సెల్ సెల్పీకెమెరా,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం,

* 4025 ఎంఏహెచ్ బ్యాటరీ.