ఒప్పో నుంచి మరో రెండు కొత్త ఫోన్లు - MicTv.in - Telugu News
mictv telugu

ఒప్పో నుంచి మరో రెండు కొత్త ఫోన్లు

September 4, 2020

oppo launching two phones in f series

ప్రముఖ చైనీయ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో మరో రెండు కొత్త మోడల్ ఫోన్లను విడుదల చేసింది. ఎఫ్ సిరీస్ లో భాగంగా ఒప్పో ఎఫ్17, ఒప్పో ఎఫ్17 ప్రో స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చింది. ఒప్పో ఎఫ్17 ప్రోలో కేవలం 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.22,900గా నిర్ణయించారు. మ్యాజిక్ బ్లాక్, మ్యాజిక్ బ్లూ, మెటాలిక్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన సేల్ సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఎఫ్17 ధరను ఇంకా ప్రకటించలేదు. ఈ ఫోన్ మాత్రం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి రానుందని. నావీ బ్లూ, క్లాసిక్ సిల్వర్, డైనమిక్ ఆరెంజ్ రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది.

ఒప్పో ఎఫ్ 17 ప్రో ఫీచర్లు

* 6.43 అంగుళాల డిస్ ప్లే,

* మీడియాటెక్ హీలియో పి95 ప్రాసెసర్,

* 16+2 మెగాపిక్సెల్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరా సెటప్,

* 48+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్,

* 8జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,

* 4000 ఏంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.

ఒప్పో ఎఫ్ 17 ఫీచర్లు

* 6.44 అంగుళాల డిస్ ప్లే,

* స్నాప్ డ్రాగన్ 662 ప్రాసెసర్,

* 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,

* 48+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్,

* 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్,

* 4000 ఏంఏహెచ్ బ్యాటరీ,

* ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టం.