ఎదురుగా రైలు.. ఓ యువకుడు ఓ పోలీసు - MicTv.in - Telugu News
mictv telugu

ఎదురుగా రైలు.. ఓ యువకుడు ఓ పోలీసు

March 24, 2022

03

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ యువకుడు రైలు ముందు దూకి, ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నిస్తుండగా రైల్వే పోలీస్ అధికారి ఆ యువకుడిని కాపాడిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. థానే జిల్లా విఠల్‌వాడి రైల్వే స్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం ఓ యువకుడు రైలు కిందపడి చనిపోవాలని చూస్తుండగా, ఓ పోలీస్ అధికారి అది గమనించాడు. ఇంతలోనే రైలు రావడం ఆ యువకుడు చూశాడు. వెంటనే పట్టాల మీదికి దూకి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. వెంటనే అక్కడున్న పోలీస్ అధికారి వెనకముందు ఏమీ ఆలోచించకుండా సాహసం చేసి ఆ యువకుడిని కాపాడాడు.

అనంతరం ఆత్మహత్యకు ప్రయత్నించిన ఆ యువకుడి వయసు కేవలం 18 ఏళ్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్ధేశంతో మదురై ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చిన యువకుడు రైలు వచ్చే ముందు రైలు పట్టాలపైకి దూకడం అక్కడున్న ప్రయాణీకులను షాక్‌కు గురిచేసింది.పోలీసుే అతణ్ని కాపాడిన వీరోచిత ఘటనను సీసీటీవీ కెమెరాలో చిత్రీకరించి వెస్టెన్ రైల్వే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఘటన అనంతరం అధికారులు యువకుడిని రైల్వే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, అతని తల్లిదండ్రులను పిలిపించారు. కానిస్టేబుల్ మానే తన ప్రాణాలను పట్టించుకోకుండా ట్రాక్‌పైకి దూకి యువకుడిని పక్కకు నెట్టాడని రైల్వే అధికారి కొనియాడారు.