రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం! - MicTv.in - Telugu News
mictv telugu

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం!

September 20, 2020

n vbn b

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. విపక్షాల తీవ్ర ఆందోళనల మధ్య ఆ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. విపక్షాలు మాత్రం ఓటింగ్ కోసం పట్టుబట్టాయి. విపక్షాల డిమాండ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తిరస్కరించారు. చివరికి మూజువాణి ఓటుతో బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. 

ఈ బిల్లుల ఆమోదం తరువాత డిప్యూటీ చైర్మన్ రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. ఈ బిల్లులకు బీజేపీ, వైసీపీ, బీజేడీ, టీడీపీ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు ఇచ్చాయి. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, శిరోమణి అకాలీదళ్‌, ఎస్పీ, ఆప్‌, బీఎస్పీ పార్టీలు వ్యతిరేకించాయి. అలాగే వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకుందని ఆరోపిస్తూ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చాయి. 12 పార్టీలు కలిసి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌‌పై ఈ తీర్మానం ఇచ్చినట్లు కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్ ‌పటేల్‌ తెలిపారు.