వినియోగదారులను ఆకట్టుకోవడానికి, వారి అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్.. తాజాగా మరో కొత్త ఫీచర్ తీసుకురానుంది. ఇప్పటివరకు టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు మాత్రమే స్టేటస్‌లుగా పెట్టుకునే అవకాశం ఉండగా, ఇక నుంచి వాయిస్ మెసెజ్, ఆడియోలను కూడా స్టేటస్‌గా పెట్టుకునే సౌకర్యాన్ని కల్పించనుంది.
దీనిని ‘వాయిస్ స్టేటస్’ అని పిలవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇది కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ ఉంటుందని తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా, త్వరలో రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదికాక, మరో ఆసక్తికర ఫీచర్ కూడా కంపెనీ పరిశీలిస్తోంది. రెండు స్మార్ట్ ఫోన్ల నుంచి ఒకే వాట్సాప్ అకౌంట్ యూజ్ చేసేలా ప్రణాళిక రచిస్తోంది. ఇది ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉందని, అందుబాటులోకి రావడానికి సమయం పడుతుందని కంపెనీ వెల్లడించింది.