నారాయణపేట : బోల్తాపడ్డ ఆరెంజ్ ట్రావెల్ బస్సు.. తీవ్ర గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

నారాయణపేట : బోల్తాపడ్డ ఆరెంజ్ ట్రావెల్ బస్సు.. తీవ్ర గాయాలు

May 12, 2022

నారాయణపేట్ జిల్లాలో గురువారం ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. దీంతో ఎనిమిది మందికి తీవ్రంగా మరికొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 36 మంది ప్రయాణీకులు ఉన్నారు. జిల్లాలోని మాగనూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు వేగంగా వస్తున్న క్రమంలో రోడ్డుపై ఎదురుగా గేదె అడ్డురావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రయాణీకులు తెలిపారు. భారీ ప్రమాదం తప్పడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.