శుభ్రంగా, అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. కానీ పరిస్థితులు, వాతావరణం, ఆహారం ఇవన్నీ మనుషుల మీద తెగ ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న కాలుష్యం, పరిశుభ్రత లేకపోవడం వల్ల చాలా మంది మొహం మీద మచ్చలు, మొటిమలతో బాధపడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి మొహాన్ని క్లియర్ గా ఉంచుకోవడానికి ఏవేవో వాడుతుంటారు. వాటిల్లో ఫేస్ వాష్ లు ఒకటి. అయితే అన్ని రకాల ఫేస్ వాష్ లూ మనల్ని శుభ్రంగా ఉంచలేవు.మన చర్మానికి అయిన మానిని పోగొట్టలేవు. అన్నింటిలో కన్నా బెస్ట్ వేప. దీనితో తయారు చేసిన ప్రోడక్ట్ సునంచి ఉత్తమ ఫలితాలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఇలాంటి వేప ఫేస్ వాష్ ల్లో ఏది బెస్టో తెలుసుకోవలనుకుంటున్నారా. అయితే ఇది మీ కోసమే. ఇప్పడు చెప్పబోయేవి అన్నీ సహజమైన వేప లక్షణాలతో నిండి ఉన్నాయి. నీమ్ ఫేస్ వాష్‌ల తయారీ లో ఎలాంటి హానికరమైన రసాయనాలు ఉపయోగించలేదు. ఇవి అన్ని రకాల చర్మ తత్వాల వారికి ప్రయోజనకరంగా ఉంటాయి.
హియాలయా:
హిమాలయా బ్రాండ్‌కు చెందిన ప్రోడక్టు ఇది. సహజమైన పదార్థాలతో తయారు చేసిన ఫేస్ వాష్ ఇది. ఈ ఫేస్ వాష్‌లో వేప లక్షణాలు అధికంగా ఉన్నాయి. దీని వల్ల మొటిమలు లేని, ఆయిల్ ఫ్రీ స్కిన్ టోన్ పొందవచ్చు. ఈ ఫేస్ వాష్ దాదాపు అన్ని చర్మ రకాలకు తగినది. మొటిమలు, మచ్చల సమస్యను తగ్గించడంలో ఇది గొప్పగా సహాయ పడుతుంది.
అరోమా బ్రాండ్:
అరోమా బ్రాండ్‌కు మార్కెట్‌లో మంచి పేరు ఉంది. ఈ ఫేస్ వాష్ చర్మాన్ని డీప్ క్లీన్ చేస్తుంది. ఇది వేప, టీ లక్షణాలను కలిగి ఉంది. ఇది మెరిసే , ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది. ఈ ఫేస్ వాష్ వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ కూడా తగ్గుతాయి.
బయోటిక్ కంపెనీ:
బయోటిక్ కంపెనీకి చెందిన ఈ ఫేస్‌వాష్ సహజంగా తయారు చేసారు. మొటిమల నియంత్రణ కోసం ఉత్తమమైన ఫేస్ వాష్ ఇది. ఈ ఫేస్ వాష్ దాదాపు అన్ని చర్మ రకాలకు తగినట్లుగా ఉంటుంది. తాజా వేప లక్షణాలను ఇది కలిగి ఉంది. ఈ ఫేస్ వాష్ రసాయన రహితమైనది. దీన్ని పురుషులు, మహిళలు ఇద్దరు కూడా ఉపయోగించవచ్చు.
ఆర్గానిక్ ఫేస్ వాష్ :
ఇది సహజమైన, ఆర్గానిక్ ఫేస్ వాష్. దీనిని పురుషులు, మహిళలు ఇద్దరూ ఉపయోగించొచ్చు. ఈ ఫేస్ వాష్‌లో ఎలాంటి హానికరమైన రసాయనాలు ఉపయోగించలేదు. వినియోగదారులు దీనికి 4 స్టార్స్ రేటింగ్ ఇచ్చారు. Organic Face Wash ధర కూడా తక్కువే.
వావ్:
ఇది కూడా చాలా మంచి ఫేస్ వాష్. ఇది ప్యూర్ ఆర్గానిక్. మొటిమలను తగ్గించడంలో సహాయ పడుతుంది. ఈ ఫేస్ వాష్ టీ ట్రీ, వేప లతో తయారు చేశారు. ఈ Anti Acne Face Wash దాదాపు అన్ని చర్మ రకాలకు తగినది.