Ori Devuda Movie Collections Are Dull Although Got Positive Talk
mictv telugu

ఓరి దేవుడా ఇదేం పరిస్థితి.. విశ్వక్, వెంకటష్ ల పరువు పాయె

October 24, 2022

దీపావళికి విడుదలైన నాలుగు సినిమాల్లో ఒకటి ఓరి దేవుడా. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన ఈ సినిమా..
తమిళ సూపర్ హిట్ మూవీ ఓమై కడవలే కి రీమేక్. ఇందులో వెంకటేష్ గెస్ట్ రోల్ చేశాడు. ఇక తమిళంలో మంచి విజయాన్ని దక్కించుకోవటంతో ఓరి దేవుడా సైతం తెలుగులో భారీ అంచనాలతో విడుదలైంది. ట్రైలర్ కూడా మంచి హిట్ అవ్వటంతో తెలుగులోను ఓరి దేవుడా విజయం తధ్యం అన్న పాజిటీవ్ బజ్ ఈ సినిమాకి వచ్చింది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా చిన్న చిన్న మార్పులతో తెరకెక్కిన ఓరి దేవుడా సినిమాకి అంచనాలకు తగ్గట్లే పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. సినిమా చూసిన ఆడియన్స్ కూడా డీసెంట్ మూవీ అంటూ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

ఓవరాల్ గా పాజిటివ్ రివ్యూలతో పాటు ప్రేక్షకుల స్పందన బావుండటంతో ఓరి దేవుడానే దీపావళి విన్నర్ అనుకున్నారంతా. తప్పకుండా మంచి కలెక్షన్స్ నమోదు అయ్యే అవకాశం ఉందని కూడా భావించారు. కాని సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా టాక్ కి సరిపడ కలెక్షన్స్ రాలేవని బాక్సాఫీస్ వర్గాల చెప్తున్నాయి. సినిమా బాగానే ఉందని టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం రాకపోవడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. లాంగ్ వీకెండ్ కలిసొస్తుంది అనుకుంటే అంచనాలు తప్పాయి. ఏ మాత్రం ఆశాజనకమైన కలెక్షన్స్ నమోదు కాకపోవటం చూసి చిత్రవర్గాలు సైతం షాక్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేకపోవటం, విశ్వక్ సేన్ పై క్రియేట్ అయిన బాడ్ బాయ్ ఇమేజ్ కారణంగా కలెక్షన్స్ రాలేవంటున్నారు క్రిటిక్స్. ఇక నేడు దీపావళి సందర్భంగా అయినా ఈ సినిమా కలెక్షన్స్ పెరుగుతాయేమో చూడాలి.