అంత్యక్రియలకు 6 వేలు ఇచ్చి అనాథ ఆత్మహత్య  - MicTv.in - Telugu News
mictv telugu

అంత్యక్రియలకు 6 వేలు ఇచ్చి అనాథ ఆత్మహత్య 

September 25, 2019

అతనికి నా అన్నవాళ్లెవరూ లేరు. విధి ఆడిన వింత నాటకంలో లోకంపై విరక్తితో తనవు చాలించాడు. తను చనిపోయాక లోకానికి తన అంత్యక్రియల బాధ్యత అప్పగించడం కూడా అతనికి ఇష్టం లేదు. అందుకు కూడబెట్టుకున్న 6 వేలను అనాథలకు అంత్యక్రియలు నిర్వహించే సంస్థకు విరాళంగా ఇచ్చి మరీ బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రవి అనే యువకుడు కొన్నేళ్లుగా హైదరాబాద్‌లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. జీవితంపై విరక్తితో లోకం నుంచి నిష్ర్కమించాలనుకున్నాడు. తన వేదనకు అక్షర రూపం కూడా ఇచ్చాడు. ఆఖరి ఘడియకు ముందు.. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించే సెర్వ్‌ నీడ్‌ సంస్థ కార్యాలయానికి వెళ్లి రూ. 6 వేల రూపాయలు అందించాడు. ‘మీకెప్పుడైనా అనాథ శవం దొరికితే ఈ డబ్బు వాడండి.. ’ అని కోరాడు. తర్వాత రైలు పట్టలపై పడుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు సంఘటన స్థలం నుంచి సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నాడు. సెర్వ్ నీడ్ సంస్థ అతని కోరిక ప్రకారం ఈ రోజు పంజగుట్ట శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించింది.