అనాథలు కాదు.. ఇక దేశరక్షకులు - MicTv.in - Telugu News
mictv telugu

అనాథలు కాదు.. ఇక దేశరక్షకులు

November 20, 2017

దేశంలోని లక్షలాది అనాథ బాలలు ఇక ఆయుధాలు పట్టుకోనున్నారు. వారిని పైన్యం దత్తత తీసుకోనుంది. సైనిక శిక్షణ ఇప్పించి జవాన్లుగా మార్చనుంది. దీనికి సంబంధించి ఆర్మీ దేశంలో 9వేల శిశు సంరక్షణ కేంద్రాలతో కసరత్తు చేస్తోంది.  

జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘం(ఎస్సీపీసీఆర్), ఆర్మీకి చెందిన సశస్త్ర సీమాబల్ ఈ అంశంపై చర్చలు జరిపాయి. సంరక్షణ కేంద్రాల్లో పిల్లలకు సైన్యం సైనిక విద్యల్లో శిక్షణ ఇస్తుంది. తర్వాత అర్హులకు దేశ భద్రత బాధ్యతలు అప్పగిస్తుంది.

సైన్యం అనాథ పిల్లలను దత్తత తీసుకోవడానికి ఆసక్తి కనబర్చిందని సభ్యురాలు రూపా కపూర్ చెప్పారు. అనాథలు హుందాగా జీవించడానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. అనాథ శరణాలయాల్లోని 15 నుంచి 18 ఏళ్ల వయసుగల వారి వివరాలను ఎస్సీపీసీఆర్ రూపొందిస్తోంది. సశస్త్ర సీమా బల్ లో చేరాలకునేవారికి అస్సాంలో శిక్షణ అందిస్తారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఇతర సరిహద్దు రాష్ట్రాల్లోని పిల్లలు అస్సాం కేంద్రానికి తీసుకెళ్తారు.