Oscar 2023 : హాలీవుడ్ చరిత్రలోనే తొలిసారిగా ఏ తెలుగు సినిమాకు దక్కని గౌరవం ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంటోంది. వరుసగా ప్రతిష్టాత్మకమైన అవార్డులతో ఈ సినిమా చిత్ర పరిశ్రమలోనే సెన్సేషన్ ను క్రియేట్ చేస్తోంది. కథ, నారేషన్ తో పాట చిత్రంలోని పాటలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆర్ఆర్ఆర్ లోని ప్రతి పాట ప్రతి ఒక్కరికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది. టాలీవుడ్ ప్రేక్షకులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఈ సాంగ్ ఉర్రూతలూగించింది. అందుకే ఈ పాటకు తెలుగు సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది.
Rahul Sipligunj and Kaala Bhairava. “Naatu Naatu." LIVE at the 95th Oscars.
Tune into ABC to watch the Oscars LIVE on Sunday, March 12th at 8e/5p! #Oscars95 pic.twitter.com/8FC7gJQbJs
— The Academy (@TheAcademy) February 28, 2023
ఆస్కార్ అవాడర్డుల వేదికపైనే ప్రత్యక్షంగా ఈ పాటను పాడే ఛాన్స్ దక్కింది.
లాస్ ఏంజిల్స్‌లోని డాలీ థియేటర్‌లో మార్చి 12న ఆస్కార్ అవార్డుల వేడుక జరుగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అవార్డుల కార్యక్రమంతో పాటు వేడుకకు మరింత కలరింగ్ ఇచ్చేందుకు నిర్వాహకులు సరికొత్త ఐడియాలతో ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయిన పాట, నాటు నాటు ను 95వ అకాడమీ అవార్డ్స్ వేదికపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అకాడమీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ఖుషీ కబర్ విన్న ఆర్ఆర్ఆర్ టీం పండుగ చేసుకుంటోంది.
సినిమాలో నాటు నాటు పాట పాడిన సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ లు మోదటిసారిగా ఇంటర్నేషనల్ వేదికపై పెర్ఫార్మ్ చేయనున్నారు.
ఈ అవకాశం దక్కినందుకు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు సింగర్స్. ఈ భారీ ప్రకటనను ఉద్దేశించి రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. “ఇది నా జీవితంలో అత్యంత మరపురాని క్షణం అవుతుంది.” అని తన భావోద్వేగాన్ని వెల్లడించాడు రాహుల్ .
ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధులు, అల్లూరి సీతారామరాజు , కొమరం భీమ్ లను ఆధారంగా చేసుకుని తీసి కల్పిత కథ ఆర్ఆర్ఆర్. 1920 నాటి నేపథ్యంలో సాగిన ఆర్ఆర్ఆర్ కు అత్యద్భుతమైన సంగీతాన్ని అందించారు మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి. ఈ మ్యూజిక్ మాస్ట్రో చేసి మ్యాజిక్ సినమాకు విశేషమైన ఆధరణను తీసుకువచ్చింది. ముఖ్యంగా నాటు నాటు అంటూ ఫుల్ బీట్ తో సాగిన పాట ఈ సంవత్సరం ఆస్కార్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయ్యింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా ఆ లిరిక్ కు తగ్గట్లుగా నాటు మ్యూజిక్ ను అందించారు. ఆర్ఆర్ఆర్ విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ పాట దుమ్మురేపింది. ఈ పాటలోని బీట్ వినగానే చంటి పిల్లాడు సైతం స్టెప్పులేశాడంటే ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఇప్పుడు అదే పాటు అంతర్జాతీయ వేదికపై పాడితే ఏ రేంజ్ లో ఉంటుందో మీరో ఊహించండి.