oscar acadamy awards 2023 when and where to watch live
mictv telugu

ఆస్కార్ వేడుక ఎప్పుడు..? ఎన్ని గంటలకు..? ఎలా చూడాలి..?

March 11, 2023

oscar acadamy awards 2023 when and where to watch live

ఒకప్పుడు ఆస్కార్ అంటే విదేశీయుల పండుగ అనుకునేవారు..కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ఆర్ఆర్ఆర్‏తో తెలుగోడి సత్తా ప్రపంచానికి తెలసింది. దేశవిదేశాల్లోనూ మన ఆట ,పాట ఓ రేంజ్‏లో దుమ్ముదులిపింది. ధర్శకధీరుడు రాజమౌళీ క్రియేటివీ, స్టార్ హీరోస్ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‏ల మ్యాజికల్ పెర్ఫార్మెన్స్‏తో ప్రపంచ సినీ ప్రేక్షకులను తెలుగు చిత్రం వైపు చూసేలా చేశాయి. ఆస్కార్ బరిలోనూ నిలిచి ఆర్ఆర్ఆర్ ఏ ఇండియన్ సినిమా సాధించలేని రికార్డును సృష్టించింది. ఆస్కార్‏కు షార్ట్ లిస్ట్ అవ్వడమే కాకుండా ఏకంగా ఒరిజినల్ సాంగ్ కేటరిగీలో టాప్ 5 ప్లేస్‏లో నిలిచి అదరగొడుతోంది ట్రిపుల్ ఆర్ . ఇక గత నెల రోజులుగా భారత్‏లో ఆస్కార్ వేడుకల హంగామా కొనసాగుతోంది. మరో 48 గంటల్లో ఆస్కార్ బరిలో నెగ్గేదెవరో తేలిపోనుంది. ఇప్పటికే తారక్, రామ్ చరణ్‏లు లాస్ ఏంజిల్స్ లో మకాం వేసి విదేశీయులకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. ఎలాగైనా ఇండియన్ సినిమా గర్వపడేలా చేయాలని వీరు అన్నిరకాలుగా ప్రయత్నిస్తున్నారు. అస్కార్ వేడుక కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే ఓటింగ్ ప్రారంభమైంది. వివిధ దేశాల్లో ఓటు హక్కు ఉన్న నటీనటులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

సినీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేడుకను కళ్లారా చూసేందుకు సినీ ప్రియులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రెడ్ కార్పెట్‏పై మనవారి ఛరిష్మాను చూసేందుకు తహతహలాడుతున్నారు. నాటు నాటు పాట ఆస్కార్‏లో నిలవడంతో అందరి దృష్టి ఆస్కార్ వేడుకపైనే పడింది. ఇక మార్చి 13న ఆస్కార్ వేడుక జరుగనుంది. లాస్ ఏంజిల్స్‏లోని డాల్బీ థియేటర్ ఇందుకు వేదికకానుంది. ఈ వేడుకలను డిస్నీ హాట్ స్టార్‏లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తెల్లవారుజాము 5.30AM నిమిషాలకు అవార్డ్స్ స్ట్రీమింగ్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం వరకు ఈ వేడుకలు కొనసాగనున్నాయి. అంతే కాదు ABC.Com, ABC వంటి యాప్‏‎లలోనూ ఆస్కార్ వేడుక ప్రసారం కానుంది. మరి ఇంతటి ప్రతిష్టాత్మకమైన వేడుకను ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ జిమ్మి కెమ్మెల్ హోస్ట్‏గా వ్యవహరించనుంది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ, ఫ్యాషనిస్ట్ , పొడవుకాళ్ల సుందరి దీపికా పదుకొణె ఆస్కార్ ప్రజెంటర్ గా లక్కీ ఛాన్స్‏ను దక్కించుకుంది. అకాడమీ అవార్డ్ వేడుకల్లో మరో హైలెట్ విషయం ఉంది. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులును ఉర్రూతలూగించిన నాటు నాటు పాట లైవ్ స్ట్రీమింగ్ జరుగనుంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఎం.ఎం. కీరవాణ, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవలు లైవ్‏లో పాట పాడనున్నారు.