'Oscar' who invited the hero Surya .. the first hero in the South
mictv telugu

హీరో సూర్యను ఆహ్వానించిన ‘ఆస్కార్’.. సౌత్‌లోనే మొదటి హీరో

June 29, 2022

ప్రముఖ త‌మిళ స్టార్, హీరో, విలక్షణ నటుడు సూర్యను అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆహ్వానించింది. ఆస్కార్ 2022 అవార్డు ఫంక్ష‌న్‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా 397మందికి ఆహ్వానం రాగా, అందులో సూర్యకు చోటు దక్కింది. విశేషం ఏంటంటే సౌత్ ఇండియా నుండి మెంబ‌ర్ ఆఫ్ అకాడ‌మి అవార్డుకు ఆహ్వానం అందిన మొద‌టి హీరోగా సూర్య నిలిచాడు. బాలీవుడ్ నుండి కాజోల్‌కు అహ్వానం అందిన‌ట్లు స‌మాచారం.

ఈ ఆహ్వానంపై సూర్య ఫ్యాన్స్ గర్వంగా ఫీల్ అవుతున్నారు. తమ అభిమాన నటుడికి ఆస్కార్ వేదిక నుంచి ఆహ్వానం రావటం సౌత్ ఇండియా చిత్రసీమకే చాలా గౌరవం అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే, ఇంతకు ముందు 1988లో మెగాస్టార్ చిరంజీవికి ఈ గౌరవం దక్కింది. దాంతో అప్పట్లో ఆ వార్త సంచలనమైంది. ఆ తర్వాత మళ్లీ అలాంటి ఆహ్వానం హీరో సూర్యకు అందడంతో సినీ హీరోలు, హీరోయిన్స్ అభినందనలు తెలుపుతున్నారు.

మరోపక్క ఆస్కార్ అవార్డ్ ఆర్గనైజర్స్ కమిటీలో మెంబర్ షిప్ దక్కించుకొన్న సౌత్ స్టార్ సూర్య మాత్రమే. 2021 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన సినిమాల్లోని నటీనటులకు ఈ మెంబర్ షిప్ దక్కుతుంది. అలా సూర్య పేరు ఆస్కార్ అవార్డుల సందర్భంగా మారుమాగుతోంది. తాజాగా సూర్య న‌టించిన ‘ఆకాశం నీ హ‌ద్దురా’, ‘జై భీమ్’ చిత్రాలు ఆస్కార్ వ‌ర‌కు వెళ్లి వెన‌క్కి తిరిగి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈసారైనా సూర్య ఆస్కార్‌కు ఆస్కారం ఉన్న ఓ అద్భుత సినిమాలో నటిస్తే, బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు.